భారత్ చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో విస్తరణ ధోరణితో నిషేధిత భూభాగంలోకి వచ్చింది చైనా. ఇక భారత్ పై ఆధిపత్యం సాధించాలని అనుకుంది. కానీ భారత్ ఊహించని విధంగా ఎదురు నిలబడింది.  అంతేకాదు చైనా కు ఊహించని షాక్ ఇచ్చింది భారత ఆర్మీ. ఒకప్పుడు చైనా భారత్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకుంది. కాగా కొన్ని నెలల క్రితం భారత్-చైనా సరిహద్దు లో పరిస్థితులు చూస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదు అనుకున్నారు అందరు.



 ఆ తర్వాత చర్చలతో ఇరు దేశాల మధ్య వివాదం కాస్త సద్దుమణిగింది. కానీ ఇటీవలే ఎంతో మంది నిపుణులు కరోనా వైరస్ నిజాలు బయటపెడుతున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టిని మరల్చాలని ప్రయత్నిస్తోంది చైనా. ఈ క్రమంలోనే మరోసారి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను యుద్ధవిమానాల మొహరిస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కునేందుకు భారత్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత్ పదివేల మంది మౌంటెన్ కార్స్ఫ్ సిబ్బందిని సరిహద్దుల్లోకి పంపిచింది. అదే సమయంలో ఘాతుక్ టీం కూడా సరిహద్దుల్లో కి చేరుకుంది.



 ఇక ఈ రెండు విభాగాలు శత్రు దేశాలపై దాడిచేసి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయి  అన్నది ఇప్పటికే గతంలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనాకు అనుభవం అయింది. ఇలాంటి సమయంలో చైనా సైనికులు వణికిపోతున్నారు.  కానీ చైనా సైన్యం లో ధైర్యం నింపడానికి  ఇటీవలే అక్కడి మీడియా పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. చైనా ఆర్మీ కి చెందినటువంటి స్పెషల్ ఆపరేషన్ మెరైన్ కమెండోలు అని పాంగ్వాన్ సరస్సుకు చైనా పంపించింది అంటూ ఒక వార్త ప్రచురితం చేసింది. ఇక  సరస్సు సమీపంలో ఈ మెరైన్ కమెండోలు సంచరిస్తున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. అయితే  మెరైన్ కమెండోలు ఒకసారి నీటిలోకి దిగిన సమయంలో టోపీలు మిగతా సామాగ్రి జిల్లా తనతోపాటే ఎలా ఉంచుకున్నారు అని అందరిలో అనుమానం కలుగుతుంది. దీన్ని బట్టి ఇక చైనా గ్రాఫిక్స్ తో కొత్త డ్రామాకు తెరపడింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: