గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరిగిన వరుస దాడులు ఇప్పటికీ ప్రపంచ మరిచి పోలేదు.  ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హమాస్ తీవ్ర వాదులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా  మార్చారు.  వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఇజ్రాయిల్ రక్షణవ్యవస్థ ఐరన్ డోమ్ కారణంగా ఇక ఇజ్రాయిల్  దాడి నుంచి తప్పించుకో గలిగింది.  హమాస్ తీవ్రవాదులు వందల రాకెట్లను ప్రయోగిస్తే కేవలం ఒక్క రాకెట్ మాత్రమే ఇజ్రాయెల్లో కూలింది.


 ఇక తమ దేశ రక్షణకు భంగం కలిగించిన హమాస్ తీవ్రవాదులపై  తీవ్రంగానే ఎదురుదాడికి దిగింది ఇజ్రాయిల్. ప్రపంచ దేశాలు సైతం వనికి పోయే విధంగా వరుసగా రాకెట్ల దాడి తో ఈ యుద్ధం కొనసాగింది అనే చెప్పాలి.  ఆ తర్వాత ప్రపంచ దేశాలతో ఒత్తిడి తీసుకొచ్చి ఇక చివరికి ఇజ్రాయిల్  కాల్పుల విరమణ ఒప్పందాని కి వచ్చేలా చేసింది పాలస్తీనా ప్రభుత్వం. ఇక అంతా ప్రశాంతంగా మారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇటీవల తీవ్రవాదులు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు.  విజయం తమదేనంటూ సరిహద్దు లో ఏకంగా బెలూన్లను గాలిలోకి వదలడం మొదలు పెట్టారు.



 దీంతో ఇజ్రాయిల్ మరోసారి తన ప్రతాపం చూపించింది . ఇటీవలే ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు పదవీ కాలం పూర్తి కావడంతో ఇక ఇప్పుడు కొత్త ప్రధానిగా నెఫ్టల్ బెన్నెట్ వచ్చారు.  అయితే ఈయన పాలస్తీనాకు వ్యతిరేకత వ్యక్తం చేయరు అని అనుకున్నారు అందరు. కానీ ఇక నిన్నటి నుంచి వరుసగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయిల్. ఎడతెరపి లేని రాకెట్ల దాడికి తీవ్రవాదులు ప్రాణభయంతో పరుగులు పెడుతూ  వణికిపోతున్నారు. ఇక ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే..  నెఫ్టల్ టెన్నెట్  సైతం ఇక తమ దేశ రక్షణకు భంగం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఈ దాడితో తెలియజెప్పారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: