ఒకప్పుడు దశాబ్ద కాలం పాటు భారతదేశాన్ని నిర్విరామంగా పాలించింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ ను ఢీ కొట్టే ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా దూసుకుపోయింది. కేవలం కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి కొనసాగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఉత్తరాది పార్టీ గా మాత్రమే పిలవబడిన బిజెపి  ఇక ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నితో జతకట్టి చివరికి విజయం సాధించి కేంద్రం లో పాగా వేసింది. 2019 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది.



 ముఖ్యంగా కేంద్రంలోనే కాదు  పలు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది. దీంతో ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సాధించాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.  రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఇది జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఒకప్పుడు బిజెపి ప్రతిపక్షాలను కలుపుకొని గెలిచినట్లు గానే..  అదే ప్రతిపక్షాలను కలుపుకొని రాహుల్ ఇక కాంగ్రెస్ ను గెలిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైన తీరును ప్రజలకు వివరిస్తూ..  సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగి 2024 ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో పాగా వేయడం ఖాయం అని అంటున్నారు కాంగ్రెస్ కీలక నేతలు.



 రాహుల్ వెన్నంటే నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఎన్నో రోజుల నుంచి చెబుతున్నారు.  అయితే గతంలో కాంగ్రెస్ ఓడిపోయిన సమయంలో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. 2024 లో మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 అయితే ఒకప్పుడు రాహుల్ గాంధీకి పాలిటిక్స్ తెలియవు అంటూ విమర్శలు చేస్తూ ఇక రాహుల్ పొలిటికల్ పప్పు అంటూ  ఆర్నబ్ గోస్వామి రాహుల్ ని తీవ్రంగా అవమానించారు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది.  అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల మీద రాహుల్ గాంధీతో చర్చించేందుకు ఆర్నబ్ గోస్వామి కి దమ్ముందా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కరోనా పరిస్థితి మీద చర్చించడానికి పిలిస్తే ఎవరు ఎంతటి సమర్థులో దేశానికి అర్థమవుతుంది అంటూ కాంగ్రెస్ కీలక నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: