మ‌రో నాలుగైదు నెల‌ల్లో ఏపీ కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌నున్నాయి. కేబినెట్ నుంచి ఎవ‌రు అవుట్ అవుతారు ? ఎవ‌రు ఇన్ అవుతారు ? అన్న‌దానిపై ఇప్ప‌ట‌కి అయితే క్లారిటీ లేక‌పోయినా పార్టీ అధిష్టాన వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం కొంద‌రు నేత‌ల గుండెళ్లో అయితే రైళ్లు ప‌రిగెడుతున్నాయి. జ‌గ‌న్ ఏకంగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 90 శాతం మంది మంత్రుల‌ను ఇంటికి పంపించేస్తాన‌ని నేరుగానే చెప్పేశారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటానని చెప్పారు. ఈ 90 శాతం అనే మాట జ‌గ‌న్‌కు స‌న్నిహితులు అయిన మంత్రుల గుండెళ్లో సైతం రెళ్లు ప‌రిగెట్టించేస్తోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి 20 మంది మంత్రి ప‌ద‌వులు ఆశించారు. వీరిలో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. వీరిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేక‌పాటి గౌతం రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఖ‌చ్చితంగా న‌లుగురిని కొన‌సాగించే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే త‌న సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను కంటిన్యూ చేశార‌న్న విమ‌ర్శ ఎదుర్కొనేందుకు జ‌గ‌న్ సిద్ధంగా లేరు.

ఈ క్ర‌మంలోనే మేక‌పాటి, బాలినేని ఇద్ద‌రు మంత్రుల‌ను ఖ‌చ్చితంగా త‌ప్పించేస్తార‌నే అంటున్నారు. బంధువులను, సామాజికవర్గాన్ని దూరం పెట్టడంలో  బాలినేని మంత్రి పదవిని జ‌గ‌న్‌ రెన్యువల్ చేయ‌ర‌న్న కామెంట్స్ వినపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మ‌రో రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారు. పెద్దిరెడ్డి ఎలాగూ ఉంటారు. బుగ్గ‌న ప‌రిస్థితి ఏంట‌న్న దానిపై ఇప్ప‌ట‌కి అయితే క్లారిటీ లేదు. అందుకే పెద్దిరెడ్డి మిన‌హా మిగిలిన ముగ్గురు రెడ్డి మంత్రుల్లోనూ ఈ టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: