తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా వరకు సీరియస్ గానే దృష్టి పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా తెలంగాణ విషయంలో కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాలను కాస్త సీరియస్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తెలంగాణలో పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరిగా అంచనా వేయలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా చాలావరకు వ్యక్తమవుతోంది.

అయితే ఇప్పుడు తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మైలేజ్ తీసుకు రావాలి అంటే ప్రియాంకగాంధీ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ కూడా దక్షిణాది మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి దక్షిణాదిలో ఎక్కువగా తిరగాల్సిన అవసరం ఉందని లేకపోతే మాత్రం సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నాయకత్వ మార్పు విషయంలో కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా దృష్టి పెట్టి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కొంతమంది సూచనలు సలహాలు ఇస్తున్నారు.

అయితే ప్రియాంకా గాంధీ త్వరలో తెలంగాణ పర్యటనకు వచ్చి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తారని, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆమె పర్యటనకు చేసే అవకాశాలు ఉన్నాయని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కొంత మంది అగ్ర నాయకులతో ఆమె మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం జవసత్వాలు నింపాలి అంటే కచ్చితంగా బలమైన నాయకత్వం ఉండాలి. మరి ప్రియాంక గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు ఆమె ఆలోచనలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: