ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మంత్రి వర్గంలోకి ముఖ్యమంత్రి జగన్ ఎవరు తీసుకుంటారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. మంత్రివర్గంలో చాలామంది అగ్రనేతలు చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో కొంతమంది నేతలు అదేవిధంగా గుంటూరు జిల్లాలో కొంతమంది నేతలు, ఉత్తరాంధ్రలో కొంతమంది నేతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొంతమంది విషయంలో సానుకూలంగా ఉన్నారు అనే ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేబినెట్ నుంచి ఎవరిని తొలగిస్తారు ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. సొంత నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాలు నిర్వహించే వారిని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా ఉండి అవినీతి కార్యక్రమాల్లో పాల్గొంటూ విపక్షాల నుంచి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న వారిని ఒక ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కీలకమైన శాఖలు లో ఉండి కూడా ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని మంత్రులను జగన్ పక్కకు తప్పించే అవకాశాలు ఉండవచ్చు అనేది మీడియా వర్గాలు చెబుతున్న మాట.

కేబినెట్ నుంచి దాదాపుగా రాయలసీమ జిల్లాకు చెందిన ఒక మంత్రి అదేవిధంగా కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన ఒక మంత్రి వెళ్లి పోయే అవకాశాలు ఉండవచ్చు అని వాళ్లకు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం కూడా వెళ్లిందని పార్టీ పెద్దలు కూడా వారితో మాట్లాడారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం వైసీపీలో చాలామంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో సమర్థులైన వారిని కేబినెట్ లోకి తీసుకుంటే అటు విపక్షాలకు సమాధానం చెప్పడమే కాకుండా పనితీరు విషయంలో కూడా తనకు సహకరిస్తారు అనే అభిప్రాయంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap