ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మార్పులకు సంబంధించి ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎవరిని నియమించే అవకాశం ఉంది ఏంటి అనే దానిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని ఇప్పటికే ఢిల్లీ కూడా పిలిచారు అనే ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరుగుతుంది. గవర్నర్ ఢిల్లీ పర్యటన విషయంలో స్పష్టత లేకపోయినా ఏపీ గవర్నర్ ను మార్చే అవకాశం మాత్రం ఎక్కువగా కనబడుతోంది. గత కొన్ని రోజులుగా గవర్నర్ సైలెంట్ గా ఉండటం ఢిల్లీ పెద్దలకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి నివేదికను పంపక పోవడం వంటివి కాస్త హాట్ టాపిక్.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్  గవర్నర్ గా   కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను నియమించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి యడ్యూరప్ప  ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడారని ఆయన కూడా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. యడ్యూరప్పకు ముఖ్యమంత్రి జగన్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో గవర్నర్ గా యడ్యూరప్ప నియమిస్తే ఫలితం ఉంటుందా లేదా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన వర్గం ఇబ్బంది పడకుండా ఉండటానికి, ఆయన కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి, ఇన్నిరోజులు కర్ణాటకలో పార్టీని భుజాన మోశారు కాబట్టి ఆయనను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా లేకపోతే మధ్య ప్రదేశ్ గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోశయ్యను ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు గవర్నర్ గా ఎంపిక చేసింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప బాధ్యతలు చేపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: