కరోనా పిరియడ్ లో అడపాదడపా కొన్ని గుడ్ న్యూస్ లు కూడా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వారానికి సెలవులు ఒకటో రెండో కాదు ఏకంగా మూడు రోజుల లభించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్త విన్న ఉద్యోగస్తులకు ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం రావచ్చు. కానీ యాజమాన్యాలు మాత్రం ఇదెక్కడి గోల అనుకుని అవాక్కవుతారు. ఒకటి, రెండు రోజులే ఎక్కువ అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా మూడు రోజులు ఇవ్వాలా అంటూ ఉసూరుమంటారు. అయితే ప్రభుత్వం మాత్రం లేబర్ కోసం నూతన ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉంది. వీలైనంత త్వరలో ఒకటి రెండు రోజులకే పరిమితమైన సెలవు నిబంధనల్లో సంచలనాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మార్పు లేబర్ కు అత్యంత సంతోషం కలిగించేదే అంటూ వినికిడి.

ఇకపై వారంలో పని దినాలు 5 రోజులు కాదు నాలుగు రోజులే అంటూ, కాకపోతే వర్కింగ్ అవర్స్ మాత్రం కాస్త పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్కింగ్ అవర్స్ రోజుకి 8 గంటలు ఉండగా, సెలవుల్లో మార్పు కనుక చోటుచేసుకున్నట్లు అయితే ఆ సమయం 12 గంటలకు పెరగవచ్చని అంటున్నారు.  ప్రభుత్వం కూడా ఈ తరహా ప్రణాళికను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇదంతా ఉద్యోగస్తులు మరియు యాజమాన్యాల మధ్య పరస్పర ఒప్పందం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది ప్రభుత్వం. ఈ మేరకు ఈ ఎంపికను కొత్త లేబర్ కోడ్ లోని నిబంధనలలో ఉంచనున్నట్లు నివేదికలో తెలిపింది.

అయితే వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉండగా 8 గంటల లెక్కప్రకారం 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పన్నెండు గంటల షిఫ్ట్ ప్రకారం మొత్తం 48 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఇక ఇంతకు మించి చేసే అదనపు పని గంటలు ఓవర్ టైం క్రింద చార్జ్ చేయబడుతుందని నివేదికలో పేర్కొంది. కావున 48 గంటలకు మించి పని చేయాల్సి వస్తే అందుకుగాను యాజమాన్యం మీకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఉద్యోగులు ఏ విధంగా స్పందించనున్నారో ? ఇది ఎంతవరకు ఎవరికీ ప్లస్ కానుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: