నేటి రోజుల్లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకునే వారికి ఎన్నో మార్గాలున్నాయి.  నేటి రోజుల్లో ఎంతోమంది పెట్టుబడి పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న మార్గం స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ద్వారా  ఎంతోమంది  కోటీశ్వరులు గా మారిపోతున్నారు.  అయితే స్టాక్ మార్కెట్ షేర్లపై పెట్టుబడి పెట్టాలంటే ముందుగా స్టాక్ మార్కెట్ పై ఎంతో అవగాహన ఉండాలి.. లేదంటే చివరికి నష్టాల పాలై ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.



 అయితే కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్స్ పై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని ట్రావెల్స్ కంపెనీల షేర్లు కాస్తా నష్టాల బాట పట్టాయి. కానీ  ఇక్కడ ఒక కంపెనీ షేర్స్ మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపిస్తున్నాయి. బిఎస్ఎల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కంపెనీ షేరు ఇటీవల కాలంలో అదిరిపోయేలా దూసుకుపోతుంది. ఇన్వెస్టర్లకు  లాభాలు మూడింతలు పెంచింది. దేశాల్లో లాక్ డౌన్ ఉన్నా కూడా ఈ షేరు ధర కేవలం ఏడాది  కాలంలో 220 శాతం పెరిగి అటు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తుంది . ఇది స్మాల్ క్యాప్ స్టాక్. ఇక గత ఏడాది   ఈ షేరు ధర రూ.43గా ఉండేది. కానీ ఇప్పుడు షేర్ ధర భారీగా పెరిగిపోయింది.  ఇప్పుడు ఈ స్టాక్ ధర రూ.139 వద్ద కొనసాగుతోంది.



అంటే ఒకవేళ మీరు సరిగ్గా ఏడాది కిందట ఈ కంపెనీ షేర్లపై   రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీ డబ్బు విలువ రూ.3 లక్షలకు పైనే అయ్యి ఉండేది. కేవలం ఏడాది వ్యవధిలోనే లక్షకు మూడు లక్షలు లాభం పొంది ఉండేవారు. అయితే స్టాక్ మార్కెట్లో లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది గ్లోబల్ వీసా ఔట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ప్రభుత్వాలతో, ఎంబసీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ ఉంటుంది. 32 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: