ప్రస్తుతం దేశం లోని అన్ని రాష్ట్రా లలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొన సాగుతోంది.  ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగు తున్నాయి. అయితే ఈ ప్రక్రియ లో కొన్నిసార్లు అటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అయితే ఇక మొదటి డోసు ఒక వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక రెండవ డోసు మరొ వ్యాక్సిన్ వేసిన ఘటనలు ఇప్పటి వరకు వెలుగు లోకి వచ్చాయి.



 సాధారణం గా అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణీత సమయం ముగిసిన తరువాత రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది.అది కూడా మొదటి డోసు ఏ వ్యాక్సిన్ అయితే వేసుకున్నారో.. రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలి.  కానీ ఇక్కడ ఒక మహిళకు రెండు రకాల వ్యాక్సిన్లను అందించారు వైద్య సిబ్బంది. అది కూడా కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఇచ్చారు ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పాట్నాలోని పున్ పున్ బ్లాక్ ప్రాంతం లో చోటు చేసుకుంది ఈ ఘటన



 ఇటీవల స్థానిక పాఠశాల లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంతో సునీలా దేవి అనే మహిళ అక్కడికి వెళ్ళింది  ముందుగా సదరు మహిళకు కోవిషీల్డ్  ఇచ్చారు వైద్య సిబ్బంది. ఆ తర్వాత అబ్జర్వేషన్ రూమ్ లో కూర్చోబెట్టారు. ఇక ఇంతలో మరో నర్స్ సునీలాదేవి దగ్గరికి వచ్చి కోవాక్సిన్ ఇచ్చింది. అయితే తాను టీకా తీసుకున్నానని నర్స్ చెప్పినప్పటికీ మాట వినకుండా అలాగే కోవాక్సిన్ ఇచ్చిందని సదరు మహిళా వాపోయింది. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇక మహిళా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఆమెను అబ్జర్వేషన్ లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: