ఇటీవల తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లో అన్ని శాఖలకు సంబంధించి కీలక చర్చలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి లో భాగం గా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక వ్యవసాయ శాఖకు సంబంధించి పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రం లో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి మూడు కోట్ల టన్నులకు చేరుకుందని ఇటీవల వ్యవసాయ శాఖ అటు క్యాబినెట్ కు తెలిపింది.



 అయితే ఈసారి సాధారణ వర్ష పాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని వ్యవ సాయ శాఖ తెలిపింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే ఐదు శాతం ఎక్కువ వర్ష పాతం నమోదయింది తెలిపింది.  ఇటీవలే ముగిసిన సీజన్లో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం 1.4 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని ప్రభుత్వం తెలిపింది. 5145 కోట్ల రూపాయలను రైతు బందు పథకం లో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేసామని వ్యవసాయశాఖ ఈ సందర్భం గా క్యాబినెట్లో తెలిపింది.




 అయితే కరోనా వైరస్ కష్ట కాలం లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు రికార్డు స్థాయి లో ధాన్యం సేకరణ జరిగిందని వ్యవసాయ శాఖ చెప్పు కొచ్చింది . కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా వ్యవసాయ శాఖ పనితీరుపై అటు ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది   గొర్ల పెంపకం వృత్తిలో ఉన్న యాదవులకు  గొర్ల పెంపకం పథకాన్ని ప్రారంభించాలని.. నాయిబ్రాహ్మణుల కోసం మోడరన్ సెలూన్ లు తక్షణం ఏర్పాటు చేయాలని కేబినేట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు  గీత కార్మికులకు భీమా..  మత్స్య కార్మికులకు గీత కార్మికులకు అందించాల్సిన ఎక్స్గ్రేషియా  వెంటనే విడుదల చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: