ఇటీవలే మల్లన్న సాగర్ ముంపు గ్రామ బాధితులైన మల్లారెడ్డి తనకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదు  అన్న కారణంతో మనస్తాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. అయితే మల్లన్నసాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అంటూ అటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.




 ముఖ్యంగా వైయస్ షర్మిల పార్టీకి చెందిన కొంత మంది నేతలు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు చేశారు  ఇక ఇప్పుడు నేరుగా వైయస్ షర్మిల మల్లారెడ్డి ఆత్మహత్యపై స్పందించారు.  మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు  ఓవైపు ఎంతోమంది ప్రాణాలు పోతుంటే ప్రభుత్వానికి ఎందుకింత పరిహాసం అంటూ ప్రశ్నించారు.  ముంపు గ్రామాల బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుదే కదా అంటూ ప్రశ్నించారు.




 మల్లారెడ్డి ఆత్మహత్యకి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణం అంటూ విమర్శించారు. కెసిఆర్ హరీష్రావు లే మల్లారెడ్డి ఆత్మహత్యకు బాధ్యత వహించాలి అంటూ వ్యాఖ్యానించారు.  సీఎం సొంత ఇలాకాలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొంటే.. ముఖ్యమంత్రికి కనీసం సిగ్గు అనిపించడం లేదా అంటూ సంచలన విమర్శలు చేశారు. కెసిఆర్ బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పాడని.. బంగారు తెలంగాణ అంటే ప్రజలు బలవన్మరణాలకు పాల్పడటమేనా అంటూ ప్రశ్నించారు.   నిర్వాసితులకు ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి చెక్కులు ఇస్తే చివరికి అవి బౌన్స్ అయ్యయి అని ఆరోపించారు  ఇక మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు  2013 భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన పోరాడత అంటూ హెచ్చరించారు వైఎస్ షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి: