టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తు పూర్తి అగ‌మ్య గోచ‌రంగా మారింది. ఏ మాత్రం రాజ‌కీయ అనుభ‌వం లేకుండా తండ్రి సీఎంగా ఉన్నాడ‌నే లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసిన రెండు రోజుల‌కే మంత్రిని చేసేశారు. మంత్రిగా రెండేళ్ల పాటు లోకేష్ ఏపీలో చ‌క్రం తిప్పారు. చివ‌ర‌కు ఇత‌ర మంత్రుల శాఖ‌ల్లోనూ ఆయ‌న జోక్యం చేసుకున్నారు. క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్ ను ఎక్క‌డ నుంచి పోటీ చేయించాలా ? అని చంద్ర‌బాబు , పార్టీ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. హిందూపురం, కుప్పం, పెన‌మ‌లూరు, పెద‌కూర‌పాడు ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ప‌రిశీ లించి.. చివ‌ర‌కు నాన్చి నాన్చి రాజ‌ధాని  అమ‌రావ‌తి ప‌రిధిలో ఉన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపారు.

ఐదేళ్ల పాటు తామంతా అక్క‌డే మ‌కాం వేసి అమ‌రావ‌తిని అభివృద్ధి చేశాం.. క‌దా ఇంట్లో కూర్చుంటే చాలు లోకేష్ గెలిచి అసెంబ్లీలోకి వెళ్లిపోతాడ‌ని అనుకున్న బాబుకు మంగ‌ళ‌గిరి ఓట‌రు దిమ్మ‌తిరిగి పోయే షాక్ ఇచ్చారు. మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిపై 5 వేల ఓట్ల పై చిలుకు తేడాతో ఓడిపోయారు. చిన‌బాబు రాజ‌కీయ చ‌రిత్ర‌లో తొలి ఎన్నిక‌ల్లోనే ఓడిపోవ‌డం నిజంగా ఘోర‌మైన అవ‌మానం. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరికి లోకేష్ బై బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తండ్రి చంద్ర‌బాబు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న కుప్పం లేదా విశాఖ జిల్లాలోని భీమిలి నుంచి పోటీ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. లోకేష్ కుప్పంలో పోటీ చేస్తే బాబు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి బ‌రిలో ఉంటారు. ఒక వేళ లోకేష్ భీమిలిలో పోటీ చేస్తే చంద్ర‌బాబు కుప్పం వ‌ద‌ల‌రు. భీమిలిలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన స‌బ్బం హ‌రి ఇటీవ‌ల మృతి చెందారు. అక్క‌డ పార్టీ బాధ్య‌త‌లు ఎవ్వ‌రికి ఇవ్వాల‌న్న దానిపై టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే లోకేష్ పేరు సైతం అక్క‌డ ప‌రిశీల‌న‌కు వ‌చ్చింద‌ని టాక్ ?  మ‌రి చిన‌బాబు ఏం చేస్తారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: