డిసెంబ‌ర్‌లో ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుంద‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. కానీ అమరావ‌తిలో ఉన్న వాతావ‌ర‌ణం చూస్తుంటే మాత్రం సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌లోనే మంత్రి వ‌ర్గ మార్పులు, చేర్పులు ఉంటాయ‌న్న‌ట్టుగా ఉంది. స‌రే మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఎప్పుడు చేయాల‌న్న‌ది సీఎం జ‌గ‌న్ ఇష్టం.. అందులో ఎవ‌రిని ఉంచాలి.. ఎవ‌రెవ‌రిని త‌ప్పించాల‌న్న‌ది కూడా పూర్తిగా జ‌గ‌న్ ఇష్ట‌మే. అయితే మంత్రి వ‌ర్గంలో చేరే వాళ్ల‌లో చాలా మంది పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇందులో  ఏపీ ఐఐసీసీ చైర్ పర్సన్ రోజా, స్పీకరు తమ్మినేని సీతారాం, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నారు. జగన్ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి గ్యారంటీగా వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు.

అయితే జిల్లా స‌మీక‌ర‌ణ‌లు, సామాజిక సమీకరణాల్లో రోజాకు దెబ్బ తగిలింది. ఆమె రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో వ‌రుస‌గా రెండో సారి గెలిచినా మంత్రి ప‌ద‌వికి దూరం కావాల్సి వ‌చ్చింది. అప్ప‌ట్లో జ‌గ‌న్‌తో పాటు త‌న‌కు ప‌ద‌వి రానివ్వ‌లేద‌ని కొంద‌రు మంత్రుల‌పై గ‌రం గ‌రం లాడిన రోజ‌మ్మ పార్టీకి దూరంగా హైద‌రాబాద్‌లోనే ఉంది. త‌ర్వాత జ‌గ‌న్ పిలిచి బుజ్జ‌గించారు. నువ్వు మంత్రి కాని మంత్రివే అని స‌ముదాయించాడు. కన్విన్స్ చేసి ఆమెకు ఏపీ ఐఐసీసీ చైర్ పర్సన్ పదవి అప్పగించాడు. కానీ ఆ పదవిలో రోజా ఉందనే సంగతి ఏపీ జనాల్లో ఎంత మందికి తెలుసున్న‌ది ప్ర‌శ్నించుకుంటే అంద‌రూ తెల్ల‌మొఖం వేయాల్సింది.

ఆమె ఇప్పుడు రెండు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. ఒక‌టి న‌గ‌రి ఎమ్మెల్యే.. రెండోది ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ ఐఐసీ చైర్మ‌న్‌. ఆమె ఇలాంటి ప‌ద‌వుల్లో ఉండి హైద‌రాబాద్‌లో మ‌కాం ఉంటూ టీవీ షోలలో. జబర్దస్త్ కార్యక్రమంలో పగలబడి నవ్వడం, డ్యాన్సులు చేస్తుండ‌డంతో ప్ర‌జ‌ల‌కు కూడా న‌చ్చ‌డం లేదు. రేపు ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇస్తే నాకు జ‌బ‌ర్ద‌స్తే ముఖ్యం .. అదే న‌న్ను , నా కెరీర్ ను కాపాడింద‌ని ఆమె ఇలాంటి ప‌నులు చేస్తే ఖ‌చ్చితంగా జ‌గ‌న్‌కు , పార్టీకి ఇబ్బందే.. అందుకే సొంత పార్టీ వాళ్లే మ‌రోసారి ఆమె మంత్రి ప‌ద‌వి కి అడ్డం కానున్నార‌ని టాక్ ?  మ‌రి రోజా విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యం ఏంటో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: