కరోనా కిట్లో మద్యం బాటిల్..? అవాక్కైన  ప్రజాప్రతినిధులు..!

ఎన్నికలప్పుడో,  ఏదైనా ప్రచార సభలు నిర్వహించినప్పుడో  మద్యం బాటిళ్లు పంచుతారనేది  వింటూనే ఉన్నాం. కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకుల తీరే చాలా భిన్నంగా,  ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  ప్రజలను, నాయకులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఏ పని చేసిన కొత్తగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఎమ్మెల్యే  చేసిన పని చూస్తే,  ఓ పక్క నవ్వుతో పాటు మరో పక్క ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎంతోమంది రాజకీయ నాయకులు,  దాతలు,  సహాయగుణం ఉన్న వారు వారికీ నచ్చిన రీతిలో వివిధ రకాలుగా పేద ప్రజలను ఆదుకుంటున్నారు.  కొంతమంది కూరగాయలు,  పండ్లు, మాస్కులు,  శానిటైజర్,  నిత్యావసర సరుకులు,  ఆక్సిజన్ లాంటివి అందజేస్తూ వారికి తోచిన సహాయాన్ని పేదలకు అందిస్తున్నారు.

 కానీ ఇప్పటివరకు ఎవరు పంచని కరోనా కిట్లను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పాన్సర్ చేశారు. వీటిని మైబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్  ప్రజాప్రతినిధులకు అందించారు. ఈ కరోనా కిట్లను తీసుకుంటున్నది టిఆర్ఎస్ జెడ్పిటిసిలు,  ఎంపిటిసిలు,  మున్సిపల్ కార్పొరేటర్లు ఈ కిట్లో శానిటైజర్లు,  మాస్కులు,  ఎండిన పండ్లు, పల్స్ ఆక్సీమీటర్ ఉంటాయని బయట చూపించాడు.  కానీ ఇంటికి వెళ్లి కిట్ తెరిచి చూసిన నాయకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.  ఈ కిట్లో ఒక ఆఫ్ టీచర్స్ మద్యం బాటిళ్లు కూడా అందించారు.


 దీంతో టిఆర్ఎస్ నాయకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటే దీన్ని బట్టి చూస్తే  నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆకట్టుకుంటారనేది ఈ తతంగం చూస్తే అర్థమవుతుంది.  అయితే కరోనా అంతం చేయాలంటే మందు కూడా తాగాలి అనేది,  ఈమధ్య విరివిగా ప్రచారం అవుతోంది.  దాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యాన్ని కూడా కరోనా కిట్లో జోడించారనేది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం.  ముందు ముందు ఇలాంటి సంఘటనలు చూసి ఎంత నవ్వుకోవాల్సి వస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: