తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులను టార్గెట్ చేసి తమ పార్టీలోకి తీసుకు వెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళాలి అని భావించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించి కేంద్ర నాయకత్వం... ఆయనకు కాషాయ కండువ కప్పేసింది. ఈటెల రాజేందర్ తో పాటుగా త్వరలోనే మరికొంతమంది కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పి అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త పట్టుదలగా వ్యవహరిస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి. తుమ్మల నాగేశ్వర రావుకి అదేవిధంగా బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు. ఈ నేపథ్యంలో సుజనాచౌదరి బీజేపీ లోకి రావాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానిస్తున్నామని అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా ఇబ్బందులు వస్తాయి ఏమో అనే ఆందోళనలో ఉన్నారని అయితే నేను ఉన్నాను అనే హామీని సుజనాచౌదరి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు అని మీడియా వర్గాలు అంటున్నాయి.

తుమ్మల వర్గం ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో సైలెంట్ గానే ఉంటుంది. పాలేరు ఎమ్మెల్యే స్థానం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గానీ ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని కార్పొరేషన్ ఎన్నికల్లో గానీ పెద్దగా పని చేసిన పరిస్థితి లేదు. అయితే బీజేపీ నుంచి భారీ ఎత్తున ఆహ్వానాలు రావడంతో ఆయన ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చివరికి సుజనా చౌదరి ఎంటర్ కావడంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన మారినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: