ఏపీ ఎస్ఈసీగా గ‌తేడాది నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించిన జ‌గ‌న్ ఆఘ‌మేఘాల మీద తమిళ‌నాడుకు చెందిన కనగరాజ్ ను ఏపీ ఎస్ ఈసీ గా నియ‌మించారు. అయితే ఊహించని  పరిణామాలతో హైకోర్టు అదేశం తో ఆయ‌న‌ పదవి కోల్పోయారు. క‌న‌గ‌రాజ్‌ను జ‌గ‌న్ వాడుకుని బ‌లి చేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే దీన్ని దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్ దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. ఈ పీసీఏ పోలీసులపై ఫిర్యాదులను విచారించ‌నుంది.

పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయినా కూడా సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించేలా నిబంధ‌న‌లు ఉన్నాయి. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ప‌ని చేస్తున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణ లో సైతం ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి అని నిబంధనలు ఉన్నాయి.

ఈ పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్ తో పాటు మ‌రో రిటైర్డ్ ఐపీఎస్ కూడా ఉంటారు. అలాగే స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధుల‌ను ప్ర‌భుత్వం ఎంపిక చేస్తూ ఉంటుంది. అయితే ఇక్క‌డే చిన్న లోపం కూడా ఉంది. ఈ పీసీఏ ఎన్ని సిఫార్సులు చేసినా కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంటారు. ఏదేమైనా క‌న‌గ‌రాజ్‌కు మొత్తానికి జ‌గ‌న్ ఇలా న్యాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: