ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ప్రయాణం చేయడం జనసేన పార్టీ నాయకులకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు అనే అభిప్రాయాన్ని కొంతవరకు వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కారణంగా తాము నష్టపోయామనే అభిప్రాయంలో చాలామంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి భారతీయ జనతా పార్టీ ప్రధాన కారణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అభిప్రాయపడ్డారు. బహిరంగంగానే దీనిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా సరే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సీట్ కేటాయించడం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో అసహనం వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ ఏ మాత్రం కూడా గౌరవించ లేదు అని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా అధికార పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహాయం చేసినట్టుగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని చాలామంది జనసేన పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అదేవిధంగా తోట చంద్రశేఖర్ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ ముందు డెడ్లైన్ పెట్టారని, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే అవకాశం ఉంటే మాత్రం ఆలోచన విరమించుకోవాలని, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితే మాత్రం స్పష్టంగా చెప్పాలని, లేకపోతే తాము కలిసి రాలేమని అని స్పష్టంగా చెప్పారని కూడా మీడియా వర్గాలు అంటున్నాయి. బిజెపి కారణంగా ఇప్పటికే ప్రజల్లో చులకన ఏమని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే లేక పోతున్నామని విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా గట్టిగా మాట్లాడలేక పోతున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: