ఏపీలో అధికార వైసీపీలో అన్ని జిల్లాల్లోనూ నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న వివాదాలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. తొలి యేడాది పాటు అంద‌రు నేత‌లు గ‌ప్ చుప్ గానే ఉన్నారు. పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. తొలి యేడాది వాళ్లు ప‌ద‌వులు, ప‌నులు ఆశించ‌లేదు. అంద‌రూ క‌లిసి మెలిసే ఉన్నారు. ఇక రెండో యేడాది నుంచి అస‌లు సిస‌లు యుద్ధాలు మొద‌ల‌య్యాయి. అన్ని జిల్లాల్లోనూ గ్రూపుల గోల ఉంది. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సీనియారిటీ వ‌ర్సెస్ పాపులారిటీ మ‌ధ్య స‌రికొత్త వార్ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. సీనియారిటీ అంటే పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత‌లు.. వీరు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు లేదా జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఉన్న నేత‌లు.

ఇప్ప‌డు వీరికి గుర్తింపు లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మ‌హీధ‌ర్ రెడ్డి, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు రాలేద‌న్న అస‌హ‌నం తీవ్రంగా ఉంది. ఇక పాపులారిటీ అంటే జూనియ‌ర్ నేతలు. పార్టీలో నిన్న కాక మొన్న‌.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన వాళ్లు.. ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన వాళ్లు కూడా కీల‌క‌మైన ప‌ద‌వులు త‌న్నుకుపోతున్నారు. తొలిసారే గెలిచి మంత్రులు అయిన చెల్లుబోయిన వేణు, సీదిరి అప్ప‌ల‌రాజు, శంక‌ర్ నారాయ‌ణ ఇలా వీళ్లంద‌రికి పాపులారిటీ ఎక్కువ అవుతోంది.

వేణు, అప్ప‌ల‌రాజు మొన్నే మంత్రులు అయినా కూడా దూసుకు పోతున్నారు. అయితే ఈ జూనియ‌ర్ మంత్రుల‌కు కొంద‌రు సీనియ‌ర్లు త‌మ ప‌నులు ఖ‌చ్చితంగా చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేస్తున్నార‌ట‌. కొంద‌రు మంత్రులు సీనియ‌ర్లు క‌దా ? అని గౌర‌వించి చేస్తున్నా కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం.. వారు అడిగిన తీరు న‌చ్చ‌క‌పోవ‌డంతో పాటు త‌మ ప‌ద‌వి ప‌వ‌ర్ చూపిస్తున్నార‌ట‌. ఇది సీనియ‌ర్ల‌కు న‌చ్చ‌డం లేదు. ఈ స‌రికొత్త వివాదం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: