దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. మ‌న‌దేశంలో ప్ర‌తిరోజు ల‌క్ష‌ల్లో కేసులు, వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. అయితే ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. దాంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లో స‌డ‌లింపులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కేసులు చాలా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తి వేస్తిన‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా జిమ్ లు, సినిమా థియేట‌ర్లు కూడా తెరుచుకోవ‌చ్చ‌ని చెప్పారు. 
ఇదిలా ఉండ‌గా సీఎం కేసీఆర్ అన్ని విద్యా సంస్థ‌లు కూడా జులై 1 నుండి ప్రారంభం అవుతున్నాయ‌ని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దాంతో పిల్ల‌లును త‌ల్లి దండ్రులు బ‌డికి పంపిస్తారా లేదా అన్న ప్ర‌శ్న కూడా మొద‌లైంది. దానికి కార‌ణం ఫ‌స్ట్ వేవ్ అనంత‌రం స్కూళ్లు తెరిస్తేనే త‌ల్లి దండ్రులు పంపించేందుకు వెన‌క‌డుగు వేసారు. ఇక సెకండ్ వేవ్ లో ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత ప్ర‌మాదం జ‌రింగి. ఆ ప్ర‌మాదాన్ని ప్ర‌తి ఒక్క‌రూ కండ్లారా చూసారు. మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అది కూడా పిల్ల‌ల‌పైనే ఎక్కువ ప్ర‌భావం ఉంటుంద‌ని చెబుతున్నారు. దాంతో త‌ల్లి దండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కేబినెట్ మీటింగ్ లో పిల్ల‌ల‌కు ఆన్లైన్ క్లాస్ ల‌ను నిర్వ‌హించాలా లేదంటే స్కూళ్ల‌కు పంపించాలా అన్న దానిపై త‌ల్లి దండ్రుల నిర్ణ‌యం కూడా తీసుకోవాల‌ని భావించార‌ట‌.

అయితే స్కూళ్ల‌కు పంప‌డంపై ఇప్ప‌టికే హైద‌రాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేష‌న్ వెన‌క‌డుగు వేస్తుంద‌ట‌. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రిస్క్ చేయ‌డం కంటే ఆన్లైన్ క్లాసుల‌ను నిర్వ‌హించ‌డమే ఉత్త‌మం అని భావిస్తోంద‌ట‌. ఇదిలా ఉండ‌గా టీచ‌ర్స్ యూనియన్ మాత్రం ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తుందా..? ఆన్లైన్ క్లాసును నిర్వ‌హించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేస్తుందా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: