కరోనా పాజిటివ్ బారినపడి చికిత్సపొందుతూ చనిపోయిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల సహాయం చేసే విషయం మీద కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  కరోనా చనిపోయిన బాధితుల కుటుంబాలకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించారు కాబట్టి ఆ విపత్తు నిర్వహణ చట్టం కింద బాధితులను ఆదుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషనర్ కోరారు.  అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.


 ఆర్థిక పరిస్థితులు అలాగే మరి కొన్ని ఇతర కారణాల నేపథ్యంలో కరోనా వలన చనిపోయిన కుటుంబ సభ్యులకు వారి బంధువులకు ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని చెల్లించాలి అని కేంద్ర అఫిడవిట్లో తేల్చి చెప్పింది. కరోనా కారణంగా చనిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే గనక కరోనా చికిత్సలకు నిధులు సరిపోవు అని కేంద్రం తేల్చేసింది. అంతేకాదు ఇప్పటికే అవసరమైన వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చర్యలు చేపట్టాయని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డబ్బు సాయం అంటే చేయలేమని చెప్పేసింది. 


కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిరుపేదల కోసం కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి ఇప్పటికే భారీ మొత్తాలను ఖర్చు చేశాయని అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం కూడా పడింది అని కేంద్రం పేర్కొంది. కానీ అది తమ వల్ల కాదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్లే. కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ప్రారంభించాయి. మరికొన్ని రాష్ట్రాలు అవి కూడా చేపట్టలేదు. మరి ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించ నుంది అనే అంశం మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: