ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక శాఖ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సీరియస్ గానే ఉంటున్నారు. ఆర్థిక శాఖను గాడిలో పెట్టడానికి జగన్ దాదాపు రెండేళ్ల నుంచి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సరే ఆర్థిక వ్యవస్థ విషయంలో మాత్రం మంత్రుల వైఖరి ఏమాత్రం కూడా బాగాలేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న సరే చాలా మంది మంత్రులు వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని రాజకీయంగా తమకు సహకరించిన వారికి మాత్రమే సహకరిస్తున్నారు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సరే రాష్ట్రంలో ఏ విధంగా కూడా ఆదాయం పెంచే మార్గాలు చూడటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమ కార్యక్రమాల అమలు తో పాటుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కాస్త కష్టంగానే ఉంది. అయినా సరే చాలా మంది మంత్రులు ఆదాయం పెంచే మార్గాలు కంటే కూడా ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టడంతో జగన్ కూడా పరిపాలన విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి. కీలక సంక్షేమ కార్యక్రమాలకు భవిష్యత్తులో నిధులు సమకూరకపోతే పదేపదే అప్పులు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ వెళితే అనవసరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని జగన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మంత్రుల పనితీరు విషయంలో జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారని, త్వరలోనే దీని మీద చర్యలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని, కొంతమంది మంత్రులు సచివాలయానికి కూడా రావడం లేదని కనీసం కీలక అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యడం లేదని జగన్ గ్రహించారు. దీంతో వాళ్ళను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడానికి రెడీ అన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: