ఇటీవలే నెల్లూరు లో ఎస్సీ యువకుడి పై జరిగిన దాడి కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారి పోయింది. అయితే వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేశారంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి  తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసిపి నేతల తీరును తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర డిజిపి కి లేఖ రాశారు. మల్లికార్జున్ అనే ఎస్పీ యువకుడిపై  నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఇక బాధితుడు పోలీసులను ఆశ్రయిస్తే చివరికి అధికార పార్టీ నేతలు బాధితుడు పైన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.



 ఒక అమాయకుడి పై పోలీసులు అక్రమం గా రౌడీషీట్ తెరిచారు అంటూ ఆరోపించారు  పైడేరు కాలువలో వైకాపా నేతలు యదేచ్చగా మట్టి మాఫియా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు  ఇక ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు  మల్లికార్జున్ పై కక్ష పూరితంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  అయితే ఇలా వేధింపులకు గురైన ఎస్సీ యువకుడికి న్యాయం చేయాల్సింది పోయి.. అటు పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి కుమ్మక్కవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు.




 రాష్ట్రం లో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేదు అనే విధంగానే ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమాయకుడైన మల్లికార్జున పై దాఖలైన తప్పుడు కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అసలైన నేరస్తుల పై  వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అమాయకుడైన మల్లికార్జున్ ను తప్పుడు కేసులో ఇరికించడానికి అధికార పార్టీ నేతలతో చేతులు కలిపిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు  చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sbn