ఇటీవలే తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ సిద్ధిపేట పర్యటన కాస్తా ప్రస్తుతం ఆసక్తికరం గా మారి పోయింది. సిద్దిపేట లో ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపట్టిన భవన నిర్మాణ సముదాయాలను ప్రారంభించేందుకు వెళ్లారు ముఖ్య మంత్రి కేసీఆర్. ఇక ఇటీవలే హెలికాప్టర్లో సిద్దిపేట చేరుకున్నారు.  ఈ క్రమం లోనే సీఎం కేసీఆర్ ను చూసేందుకు టిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఇక సిద్దిపేట పర్యటన లో ముఖ్య మంత్రి కే సీ ఆర్ వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు.



 మంత్రి హరీష్ రావు, మహమ్మద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్రెడ్డి డీజీపీ మహేందర్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ముఖ్య మంత్రి కేసీఆర్ వెంట సిద్దిపేట పర్యటనకు వచ్చారు  ఈ సందర్భం గా సిద్దిపేట కలెక్టర్ వెంకట రామిరెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమీపం లో ఉన్న ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య మంత్రి కేసీఆర్. ఇక తర్వాత నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు.



 అంతే కాకుండా సిద్దిపేట లో ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కూడా ప్రారంభించారు ముఖ్య మంత్రి కేసీఆర్. అత్యాధునిక సదుపాయాల తో జీ ప్లస్ వన్ గా ఎకరం విస్తీర్ణం లో నాలుగు కోట్ల తో సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయం నిర్మించారు. ఆ తర్వాత సిద్ది పేట కలెక్టరేట్ కార్యాలయం కూడా ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట్ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభించారు ముఖ్య మంత్రి కేసీఆర్. ముఖ్య మంత్రి కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం సిద్ధిపేట లో పర్యటన ముగియ గానే  అటు కామారెడ్డి లో పర్యటనకు వెళ్ల నున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr