ఎస్‌.. ఈ టైటిలే ఇప్పుడు తెలంగాణ‌లో.. ముఖ్యంగా అధికార పార్టీ వ‌ర్గాల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. తెలంగాణ ఏర్ప‌డ్డాక‌.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏ ఉప ఎన్నిక జ‌రిగినా కూడా ఆ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ వ‌న్ సైడ్‌గా మార్చేసుకుంటూ వ‌చ్చారు. నారాయ‌ణ్ ఖేడ్‌, పాలేరు, మెద‌క్‌, వ‌రంగ‌ల్ ఇలా ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా టీఆర్ ఎస్‌కు భారీ మెజార్టీలే.. అసలు ఉప ఎన్నిక అంటేనే కేసీఆర్‌, టీఆర్ ఎస్‌లో ఎక్క‌డా లేని ఉత్సాహం. గెలుపుపై వాళ్ల‌కు డౌటే అక్క‌ర్లేదు. భారీ మెజార్టీలే టార్గెట్‌. హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జునా సాగ‌ర్ ఎక్క‌డ అయినా భారీ గెలుపే. అయితే అలాంటి టీఆర్ ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం దెబ్బ కొట్టింది. ఇక్క‌డ సంచ‌ల‌న రీతిలో బీజేపీ విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు కేసీఆర్‌కు హుజురాబాద్ ఉప ఎన్నిక రూపంలో మ‌రో అగ్ని ప‌రీక్ష ఎదురు కాబోతోంది. ఉప ఎన్నిక ఏదైనా కేసీఆర్ వార్ వ‌న్ సైడ్ చేసుకుంటూ వ‌స్తున్నా హుజూరా బాద్ విష‌యంలో మాత్రం ఆందోళ‌న స్టార్ట్ అయ్యింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఉప ఎన్నిక అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే వ‌చ్చిన‌వే. అయితే హుజూరా బాద్ ఉప ఎన్నిక ఇందుకు పూర్తి భిన్నం. కేసీఆర్ ఇది ఏరికోరి తెచ్చుకుంటున్న ఉప ఎన్నిక అనే చెప్పాలి. నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులు కోవ‌డంతో పాటు టీఆర్ ఎస్‌కు రాజీనామా చేశాక వ‌స్తోన్న ఉప ఎన్నిక‌.

పైగా ఈట‌లకు హుజూరా బాద్ కంచుకోట‌. ఆయ‌న వివాద ర‌హితుడు అన్న పేరుంది. ఇక కేసీఆర్ ఆయ‌న‌కు అన్యాయం చేశార‌న్న టాక్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లి పోయింది. విచిత్రం ఏంటంటే గ‌తంలో వైఎస్‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌ను కూడా ఎదుర్కొని ఈట‌ల ఘ‌న‌విజ‌యం సాధించారు. ఈట‌ల రాజీనామా చేశాక స్థానికంగా టీఆర్ ఎస్ త‌న బ‌లం, బ‌ల‌గాన్ని మోహ‌రించి ఎంత హంగామా చేస్తున్నా కూడా ప‌ట్టు దొర‌క‌డం లేదు. విచిత్రం ఏంటంటే అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ టీఆర్ ఎస్ త‌ర‌పున పోటీ చేసేందుకు అభ్య‌ర్థి కూడా దొర‌క‌డం లేదు. ఇక ఇంటిలిజెన్స్ రిపోర్టులు కూడా ఫ‌లితం తేడా వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని చెప్ప‌డంతో కేసీఆర్ స్వ‌యంగా ఇక్క‌డ ఉప ఎన్నిక ప్ర‌చారానికి వెళ్లేందుకు రెడీ అయిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: