ఒక్కోసారి అధికారులు నిర్లక్ష్యంతో జరగని పనులు కూడా మీడియా ఎంటర్ అవ్వగానే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒక ప్రముఖ ఛానల్ లో తన తల్లి డెత్ సర్టిఫికెట్ ఇప్పించమని జగన్ ను మావయ్యా అని సంభోదిస్తూ చిన్నారితో వీడియోలు చేయించడంతో అది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే ఆ చిన్నారికి ఆమె తల్లి డెత్ సర్టిఫికెట్ ఇప్పించారు. ఆళ్ల నాని ఆదేశాలతో నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈఓ సుశీల, జిల్లా వైద్య అధికారి రాజ్యలక్ష్మి తదితరులు చిన్నారికి డెత్ సర్టిఫికెట్ అందించారు.. 


కొన్నాళ్లుగా డెత్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా జరగని పని కేవలం 15 నిముషాల్లో జరిగిపోవడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా అల్లూరు నగరపాలక పంచాయతీకి చెందిన బిరుదువోలు నోషిత అనే బాలిక తన తల్లి సర్టిఫికెట్ ఇవ్వడం లేదని పేర్కొంటూ ఏకంగా సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడంతో ఆమె తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం నెల్లూరు జిల్లా వైద్యాధికారి అలాగే జిల్లా పరిషత్ సీఈఓ తో ఫోన్ లో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్పటికప్పుడు సర్టిఫికెట్ ఇప్పించేలా సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 


ఈ క్రమంలోనే బాలికకు కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే డెత్ సర్టిఫికెట్ అందించారు అధికారులు. మే ఐదో తేదీన నెల్లూరు సైన్ హాస్పిటల్ లో నోషిత తల్లి అనుపమ కరోనా కారణంగా మృతి చెందింది. అయితే మే 11వ తేదీన తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకోగా అప్పటి నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకపోయింది ఈ నేపథ్యంలో జగన్ ని మావయ్యా అని సంబోధిస్తూ నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి లేఖ రాయడంతో పాటు ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో ఆగమేఘాల మీద స్పందించి స్పందించారు మంత్రి స్పందనతో అధికారులు క్షణాల్లో ఆ బాలికకు సర్టిఫికెట్ అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: