ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇంకా పుంజుకోలేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు దూకుడుగా ఉండటం లేదు. అలాగే దూకుడుగా ఉండే నేతలు సైతం టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ హవా ఉన్న రాయలసీమ జిల్లాలలోని టీడీపీ నేతలు, తమ భవిష్యత్ విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.


తన తల్లి శోభానాగిరెడ్డి చనిపోవడంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిల, ఆళ్లగడ్డ ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. తర్వాత తన తండ్రి నాగిరెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. నాగిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అఖిలప్రియనే భూమా ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. అలాగే ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి సైతం ఇచ్చారు. అటు నాగిరెడ్డి మరణంతో వచ్చిన నంద్యాల ఉపఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.


ఓడిపోయినా సరే అఖిల టీడీపీలో దూకుడుగానే పనిచేస్తున్నారు. ఎంత పనిచేసిన ఆళ్లగడ్డలో పుంజుకోలేకపోతున్నారు. పైగా ఆమె కుటుంబంపై పలు కేసులు వచ్చి పడ్డాయి. అటు భూ వ్యవహారాలకు సంబంధించిన ఓ కిడ్నాప్ కేసులో అఖిల జైలుకు వెళ్లొచ్చారు. ఇలా అఖిల కష్టాల్లో ఉన్నా సరే, టీడీపీ అధిష్టానం పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీలో ఉన్న తన బంధువుల ద్వారా జగన్ చెంతకు చేరేందుకు అఖిల చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది అఖిలకే తెలియాలి. ప్రస్తుతానికైతే అఖిల, బ్రహ్మానందరెడ్డిలు టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్నారు.


ఇదే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ సైతం టీడీపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏవీకి, అఖిలకు పెద్దగా పొసగదనే విషయం తెలిసిందే. పైగా ఏవీని చంపడానికి అఖిల ప్లాన్ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు సైతం వచ్చాయి. అయితే అఖిలకు ధీటుగా ఏవీ కుమార్తె జస్వంతి సైతం టీడీపీలో పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఒకవేళ భూమా ఫ్యామిలీ టీడీపీ నుంచి సైడ్ అయితే ఏవీ ఫ్యామిలీకి ఏమన్నా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: