పాపం ఆయ‌న ఎంపీగా గెలిచి ప‌ట్టుమ‌ని రెండు నెల‌లు అయినా కాలేదు.. అప్పుడే ఆయ‌న‌కు వైసీపీలో చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. పార్టీ సీనియ‌ర్లు, మంత్రులు ఆయ‌న్ను ఓ ఆటాడేసుకుంటున్నార‌ట‌. ఇదే విష‌యం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎవ‌రా కుర్ర ఎంపీ.. ఏమా క‌థ అన్న‌ది చూద్దాం. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ గురుమూర్తి ఎంపీగా గెలిచారు. 3.70 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన గురుమూర్తి ఎంపీగా ఇంకా పార్ల‌మెంటులో ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌లేదు. అప్పుడే ఆయ‌న్ను నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉన్న సీనియ‌ర్ వైసీపీ నేత‌లు, మంత్రులు ఆడేసుకుంటున్నార‌ట‌. నువ్వు మా కోట‌రిలో ఉండాలంటే.. మా కోట‌రీలో ఉండాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి చేస్తున్నార‌ట‌.


స్థానికంగా ఇప్పుడు ఈ ప్ర‌చార‌మే హైలెట్ అవుతోంది. మ‌రీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా కంటే చిత్తూరు జిల్లాలో ఉన్న ఇద్ద‌రు కీల‌క నేత‌లు అయితే గురుమూర్తి అది చేయ్‌.. గురుమూర్తి ఇది చేయ్ అని ఒత్తిడి చేస్తుండ‌డంతో ఆ ఎంపీ మిన్న‌కుండి పోతున్నార‌ట‌. గురుప్ర‌సాద్‌కు రాజ‌కీయ అనుభ‌వం ఏ మాత్రం లేదు. అయితే ఆయ‌న జ‌గ‌న్ ఫిజియో థెర‌పిస్ట్ గా చేయ‌డంతో ఆ సేవ‌ల‌ను గుర్తు పెట్టుకున్న జ‌గ‌న్ ఆయ‌న‌కు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఎంపీగా అవ‌కాశం క‌ల్పించారు. అయితే చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం కోసం చూస్తోన్న ఇద్ద‌రు నేత‌లు మాత్రం త‌మ కోట‌రీలోనే ఉండాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ట‌.


దీంతో గురుమూర్తి ఎవ‌రికి ఎస్ చెప్పాలో.. ఎవ‌రికి నో చెప్పాలో తెలియ‌క తెల్ల‌బోతున్నార‌ట‌. గురుమూర్తి రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త‌.. ఎవ‌రితో వెళ్లాలో ?  ఎవ‌రికి ఏమ‌ని చెబితే ఏమ‌నుకుంటారో అని.. ఆ ఇద్దరి మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతున్నార‌న్న టాక్ చిత్తూరు జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే చిత్తూరు వైసీపీ రాజ‌కీయాలు బ్ర‌ష్టు ప‌ట్టిపోయాయి. ఇలాంటి కొత్త నేత‌ల‌ను కూడా ఇలా చేస్తుంటే ఇక పార్టీ ఎప్ప‌ట‌కి బాగు ప‌డుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: