దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... అటు సైబర్ కేటుగాళ్లు కూడా తమ పని కానిచ్చేస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ క్రైమ్ చేయడానికి ఎవరు ఊహించని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖులను టార్గెట్ చేసిన... సైబర్ కేటుగాళ్లు తాజాగా వృద్ధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. 

అవును  ఓ డేటింగ్ పేరుతో ఓ వృద్ధుని చీట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ 77 ఏడు సంవత్సరాలు ఉన్న వృద్ధున్ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. లవ్, డేటింగ్ మరియు చాటింగ్ అంటూ ఆ 77 ఏళ్ల వృద్ధున్ని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. సరదాగా చాటింగ్ చేసిన ఆ వృద్ధుని నుంచి ఏకంగా 11 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ సైబర్ నేరగాళ్లు. అక్కడితో ఆగకుండా మరిన్ని డబ్బులు కావాలంటూ ఆ వృద్ధుని పై ఒత్తిడి తీసుకువచ్చారు. 

దీంతో విసుగు చెందిన ఆ వృద్ధుడు... చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులను ఆశ్రయించిన 77 సంవత్సరాల వృద్ధుడు... జరిగిన స్టోరీ మొత్తం చెప్పేశాడు.  ఆ 77 సంవత్సరాల వృద్ధుడి స్టోరీ విన్న పోలీసులు... షాక్ తిన్నాను. ఈ వయసులో కూడా చాటింగ్ మరియు డేటింగ్ ఏంటి అంటూ అవాక్కయ్యారు సైబర్ క్రైమ్ పోలీసులు. అంతేకాదు ఈ వయసులో ఆ పనులు ఏంటి అని .... ఆ 77 సంవత్సరాల వృద్ధినికి చురకలంటించారు పోలీసులు. దీంతో ఈ వ్యవహారంపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సైబర్ కేటుగాళ్ల పై కేసు బుక్ చేశారు. ప్రస్తుతం ఆ సైబర్ కేటుగాళ్ల కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: