ప్ర‌కాశం జిల్లా అన‌గానే వైసీపీకి కంచుకోట‌.. అనే మాట వినిపిస్తోంది. కీల‌క‌మైన నాయ‌క‌గ‌ణం ఇక్క‌డ వైసీపీకి ఉంది. పెద్ద ఎత్తున ఇటు ప్ర‌భుత్వంలోను, అటు పార్టీలోనూ చ‌క్రం తిప్ప‌గ‌ల నాయ‌కులు వైసీపీకి ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి, మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంటి కీల‌క నేత‌లు చాలా మంది వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇంత మంది ఉన్నా.. ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం పై మాత్రం వీరు దృష్టి సారించ‌డం లేదని..అ క్క‌డ ప‌ట్టు పెంచుకోలేక పోతున్నార‌ని.. దీంతో పార్టీ ఎంత బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చే స‌రికిమాత్రం ప‌ట్టు స‌డులుతోంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇంత‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏంటంటే.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయిన‌.. కొండ‌పి!  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ విజ‌యం సాధించ‌లేదు. పైగా.. ఇక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయాలూ సాగ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం .. వైసీపీ పాగా వేసింది. కానీ, ఎస్సీలు త‌మ వెంటే ఉన్నార‌ని.. ఎస్సీలకు అనుకూలంగా ఉండే పార్టీ త‌మ‌దేన‌ని చెప్పుకొనే.. వైసీపీ ఇక్క‌డ మాత్రం క‌నీసం త‌న అడుగులను ప‌దిల ప‌రుచుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి జూపూడి ప్ర‌భాక‌ర్‌ను బ‌రిలోకి దింపారు. వాస్త‌వానికి ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కుడు కాబ‌ట్టి గెలిచి తీర‌తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ప‌ద‌ళ్ల త‌ర్వాత‌ టీడీపీ గెలిచింది. ఆ పార్టీ త‌ర‌ఫున డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజానికి ఈయ‌న హ‌యాంలో అంటే.. 2014లో పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సాగ‌లేద‌నే ప్ర‌చారం ఉంది. దీనికితోడు.. స్వామికి.. టీడీపీలోనూ అసంతృప్తులు పెరిగారు. దీంతో 2019లో ఖ‌చ్చితంగా ఓడిపోతార‌ని.. వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ మాదాసి వెంకయ్య‌ను నిల‌బెట్టారు. ఈయ‌న కూడా డాక్ట‌రే కాబ‌ట్టి.. ఇబ్బంది లేద‌ని.. టీడీపీ అభ్య‌ర్థికి దీటుగా బ‌దులిస్తార‌ని అనుకున్నారు.

కానీ, వెంక‌య్య కూడా విజ‌యం ద‌క్కించుకోలేదు. అయితే.. స్వామి మెజారిటీని మాత్రం బాగా త‌గ్గించారు. ట‌ఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్న‌ప్ప‌టికీ..వ చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి?  ఎవ‌రిని ఇక్క‌డ నిల‌బెడ‌తారు? అనేది మ‌ళ్లీ వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. 2014 త‌ర్వాత టీడీపీలోకి వెళ్ల‌డం.. మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేర‌డం.. నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. కానీ, కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డంపైనా.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించే విష‌యంలోనూ జూపూడి ప్ర‌భావం లేదు. ఈ క్ర‌మంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ ఈ పార్టీదే విజ‌యం అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: