హనుమంతుని జ‌న్మ‌ స్థల వివాదంపై గత కొన్ని రోజుల నుంచి టీటీడీ కర్ణాటకలోని తీర్థ క్షేత్ర మ‌ధ్య‌ వివాదం కొనసాగుతూనే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తిరుమల తిరుపతి దేవ‌స్థాన అధికారులు హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రి పర్వతం పైనే పుట్టాడని అదే ఆయన జన్మస్థలం అని గ‌తంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై క‌ర్ణాట‌క‌లోని తీర్థ ట్ర‌స్టు స్పందిస్తూ  ఆంజనేయ జ‌న్మ‌స్థ‌లం కిష్కింద కొండ‌ మాత్రమే అని వాదిస్తోంది. టీటీడీ వి అసత్య వాదనలు ఆ ట్ర‌స్టు విమర్శిస్తుంది. ఈ విషయంలో టీటీడీ ఎంత‌కూ వెనక్కి తగ్గడం లేదు.


అయితే ఈ వివాదంపై కేంద్రం గత కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న అభిప్రాయం తెల‌య‌జేయ‌లేదు. తాజాగా ఇదే వ్యవహారంపై కేంద్రం స్పందించింది. అంజనాద్రి ని ఆంజ‌నేయుని జన్మస్థలంగా కేంద్రం ప్రభుత్వం తీసుకోలేదని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా జాతీయ స్థాయిలో హనుమంతుని జ‌న్మ‌స్థ‌లంగా ప్ర‌క‌టించ‌లేమ‌ని తేల్చిచెప్పింది.



మంగళవారం రాజ్యసభలో వైసిపి సభ్యుడు విజయ రెడ్డి ఈ వివాదంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి స్పందిస్తూ సమాధానమిచ్చాడు. హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి పేర్కొంటూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది అలాగే బుక్లెట్ విషయంపై కేంద్రం కి ఏమైనా తెలుసా.. ఈ క్రమంలో అని పేర్కొంటూ కేంద్రం ప్రకటన చేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై విజ‌య‌సాయిరెడ్డి వేసిన ప్ర‌శ్న‌కు ఆయ‌న‌ ఇలా స్పందించారు.

  అయితే రామబంటు ఆంజ‌న్న జ‌న్మ‌స్థ‌లంపై కొన్ని రోజులుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లం ప్ర‌శ్న‌పై ఎన్నో స‌మాధానాలు.. మ‌రెన్నో అనుమానాలు.. టీటీడీ  అంజ‌నాద్రియే ఆంజ‌న్న జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని, తీర్థ క్షేత్ర ట్ర‌స్టు కిష్కంద కొండలోనే హ‌నుమంతుడు జ‌న్మించాడంటున్నారు.  కొంద‌రు మాత్రం జార్ఖండ్‌, మ‌రి కొంద‌రు మ‌హారాష్ట్ర‌లోనే హ‌నుమంతుడు పుట్టాడ‌ని వాదన‌లు వినిపిస్తున్నారు.



అయితే దీనిపై టీటీడీ స్పందించి తిరుమ‌ల‌లోనే అంజ‌న్న పుట్టాడ‌ని నిరూపిస్తామ‌ని గట్టిగా వాదిస్తోంది. అలాగే నిరూపిస్తామ‌ని కూడా గ‌తంలో ప్ర‌క‌టించింది. అయితే తాజా కేంద్రం ప్ర‌క‌ట‌న‌పై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అలాగే ఏపీ ప్ర‌భుత్వం ఏమంటుందో కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

TTD