ఇటీవలే మహబూబాబాద్ జిల్లాలో గిరిజన మహిళా రైతుల పట్ల డిఆర్ఓ వ్యవహరించిన తీరు కాస్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.  పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన రైతులను అడ్డుకున్న డి ఆర్ వో  ఇక అక్కడ ఉన్న మహిళా రైతుల పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించారు. ఏకంగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఇక్కడ గిరిజన మహిళలు అందరూ ఏకంగా డిఆర్ఓ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అయితే గిరిజనులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడూ ముందు ఉంటుంది ములుగు ఎమ్మెల్యే సీతక్క. అంతేకాదు గిరిజనులకు ఎవరు అపాయం తలపెట్టాలని ప్రయత్నించినా కూడా అపర కాళిలా గా విరుచుకుపడుతూ ఉంటుంది. ఇటీవలే గిరిజన మహిళల పట్ల డిఆర్ఓ ఎంతో దురుసుగా ప్రవర్తించడం పై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డిఆర్ఓ ని వాళ్ళు కేవలం దాడి చేసి వదిలేసారు.. నేనైతే గొడ్డలితో నరికి చంపి దాన్ని అంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే సీతక్క.  గిరిజన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.



 అంతేకాకుండా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల పై పెట్టిన కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గిరిజన రైతుల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించిన డిఆర్వో ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  గిరిజనుల జోలికి వస్తే మీ పద్ధతిలోనే రాళ్లతో కొట్టి అధికారులను తరిమేయండి అంటూ గిరిజనులు అందరికీ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సీతక్క. ప్రభుత్వం హరితహారం అనే పైకి చెబుతూ అటు గిరిజన రైతుల నుంచి భూములు లాక్కుంటుంది అంటూ ఆరోపణలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: