ప్రస్తుత రోజుల్లో రోజురోజుకు అడవుల నరికివేత పెరిగిపోతుంది. దీంతో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈక్రమంలోనే మొక్కల పెంపకాన్ని ఒక యాగం లాగా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం లో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యతలను కూడా చూసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.




 ముఖ్యంగా ఇక గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను సర్పంచులకు అప్పజెప్పింది. ఏకంగా మొక్కలు చనిపోతే సర్పంచ్ పదవి పై వేటు తప్పదు అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇక ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటన చేసి సర్పంచు లకు షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గ్రామ గ్రామాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటిన్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగంగా కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం.



 అయితే ఏపీ లో ప్రస్తుతం చేపట్టిన జగనన్న పచ్చతోరణం పథకం లో భాగంగా నాటిన మొక్కలను  సంరక్షించే బాధ్యతను గ్రామాల సర్పంచులకు అప్పజెప్పింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇటీవల మొక్కల పెంపకం, సంరక్షణ పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలు 83% బతకాలని పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు. లేదంటే సర్పంచుల పై అనర్హత వేటు వేస్తామని అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు చట్టం కూడా తీసుకొస్తామని తెలిపారు.అయితే మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం మొక్కల పెంపకం ఎంతో సమర్థవంతంగా దూసుకుపోతున్న  కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.  దీంతో ఇక సర్పంచుల భవిష్యత్తు కాస్త మొక్కల పెంపకం పై ఆధారపడి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: