టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రాశి కన్నా ఒకరు. ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతున్న హీరోయిన్ రాశి కన్నా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రాశి  కన్నా. ఆ సినిమా బాక్సాఫీస్ ముందు పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత... గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమా మరియు రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమా లోని ఛాన్స్ కొట్టేసింది రాశి కన్నా. 

ఆ తర్వాత  జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే, వెంకీ మామ లాంటి పెద్ద సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది రాశి ఖన్నా.  ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో... రాశి కన్నా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో రాశి కన్నా చాలా బోల్డ్ పాత్రలు చేసింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికల పడింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ లకు రాశి కన్నా దూరంగా ఉంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రాసి కన్నా చాలా యాక్టివ్ అయింది. తాను ఏం చేసినా తాను ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా  స్టూడెంట్ తరహాలో ఓ బుక్ ముందు పెట్టుకొని.. తన బెడ్ రూమ్ లో కూర్చుని ఫోటోలు దిగింది రాశి కన్నా . అయితే వీటికి సంబంధించిన ఫోటోలను రాశి కన్నా సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాదు తనకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయని ఓకే ఆప్షన్ కూడా ఆ పోస్ట్ కు తగిలించింది. ఇప్పుడు రాశి కన్నా కు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియా లో తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: