తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల సందడి నెలకొంది. కీలక రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైయస్ షర్మిల అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలను మొదలుపెట్టడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కొంతమంది కీలక నేతలు పాదయాత్ర కు సంబంధించి ఆయా నాయకులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు మంత్రులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరిద్దరూ దాదాపుగా 6 ఉమ్మడి జిల్లాలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మెదక్ ,కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో హరీష్ రావు పర్యటించే అవకాశాలు ఉండగా వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలలో మంత్రి కేటీఆర్ పర్యటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షాకాలం పూర్తయిన తర్వాత వీళ్ళు పాద యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.

షర్మిల కూడా అక్టోబర్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చని మీడియా వర్గాలు అంటున్నాయి. బండి సంజయ్ ఆగస్టు 9 నుంచి తన పాదయాత్ర మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే మిగిలిన నాయకులు కూడా పాదయాత్రలో ను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారిని కట్టడి చేసేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ని రంగంలోకి దించుతున్నారు అని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ తేదీలు కూడా ప్రకటించే అవకాశాలున్నాయని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: