క్రికెట్ స్టేడియం అంతా భారీ పరిమాణం ఉన్న ఓ గ్ర‌హ‌శ‌కలం ప్ర‌మాద‌క‌రంగా మారి భూమి వైపు రానుందా..? అంటే అవున‌నే అంటున్నారు శాస్త్రవేత్త‌లు. '2008Go20స అని పిలువ‌బ‌డే ఈ గ్ర‌హ‌శ‌క‌లం జూలై 24న భూమికి చేరువ‌గా రానుంద‌ట‌. ఈ గ్ర‌హ‌శ‌క‌లం స్టేడియం ప‌రిమాణంలో ఉంద‌ని ఇది వేగంగా భూమివైపు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఆస్ట్రాయిడ్ ప్ర‌యాణించే గ్ర‌హ శ‌క‌లం ప్ర‌యాణించే క‌క్ష్య‌ను ఆపోలో గా నామాక‌ర‌ణం చేశారు.

  అయితే ఈ భారీ గ్ర‌హ‌శ‌క‌లం సెక‌నుకు 8 కిలోమీట‌ర్ల వేగంతో, గంట‌కు 28,800 కిలోమీట‌ర్ల వేగంతో చాలా ప్ర‌మాద‌క‌రంగా భూమివైపు ప్ర‌యాణిస్తుంద‌ట. ఇది ప్ర‌యాణిస్తున్న సంద‌ర్భంలో ఏదైనా అడ్డు త‌గిలితే తీవ్ర విప‌త్తును ఎదుర్కోనుంది. భూమికి స‌మీపంలో ఉన్న వ‌స్తువు 20 మీట‌ర్ల వేడ‌ల్పుతో భూమీ, చంద్రుల మ‌ధ్య ఇది ప్ర‌యాణిస్తుంద‌ని తెలుస్తోంది.



  అయితే ఈ గ్ర‌హ‌శ‌క‌లం భూమిని దాటి సుర‌క్షితంగా క‌దులుతుండ‌గా, గ్ర‌హానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న దాని క‌క్ష్య‌ను అపోలోగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని నాసా శాస్త్ర వేత్త‌లు వివ‌రిస్తున్నారు. దీని ప్ర‌యాణాన్ని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్టు నాసా పేర్కొంది.

  అంత‌కుముందు జూన్‌, 2021 కేటీ1 అనే ఈఫిల్ ట‌వ‌ర్ అంత ప‌రిమాణం గ‌ల గ్ర‌హ‌శ‌క‌లం భూమి దగ్గ‌ర‌కు వ‌చ్చింది.  ఈ 2021కేటీ1 గ్ర‌హ‌శ‌క‌లాన్ని ప్ర‌మాద‌క‌రంగా వ‌ర్గించారు.  ఈ గ్ర‌హ శ‌కలం 4.5 మిలియ‌న్ కిలోమీట‌ర్ల దూరంలో భూమికి ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితే 4.6 మిలియ‌న్ కిలోమీట‌ర్ల కంటే ద‌గ్గ‌ర‌గా ఏదైన వ‌స్తువు ఉంటే దానిని ప్ర‌మాద‌క‌ర వ‌స్తువుగా ప‌రిగ‌ణిస్తారు. అయితే గ్ర‌హ‌శ‌క‌లాలు త‌మ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న గ్ర‌హాల గురుత్వాక‌ర్ష‌ణ ద్వారా త‌మ క‌క్ష్య‌ల‌ను మార్చుకుంటు వ‌స్తాయి. ప్ర‌స్తుతం భూమికి స‌మీపంలో ఉన్న 26,000 గ్ర‌హ శ‌క‌లాల‌ను నాసా ట్రాక్ చేస్తోంది.
   
 

 సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన రాతి శకలాల‌నే గ్రహశకలాలు అంటారు. గ్రహశకలం కదలికను గుర్తించే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపిఎల్) ప్రకారం భూమి నుంచి సూర్యునికి ఉండే దూరం క‌న్నా 1.3 రేట్లు త‌క్కువ‌గా ఉండే వ‌స్తువుల‌ను ప్ర‌మాద‌క‌రంగా ప‌రిగ‌ణిస్తారు.




మరింత సమాచారం తెలుసుకోండి: