టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూశాం. 2019 ఎన్నికల్లో వారిని టార్గెట్ గా చేసుకుని ఆంధ్ర ప్రదేశ్ లో మరో సారి ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అవసరం లేని ప్రత్యర్థులతో పోరాటం చేసి అవసరమైన ప్రత్యర్థిని వదిలేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి తీసుకువచ్చారని చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

తనకంటే రాజకీయాల్లో అదేవిధంగా పరిపాలనలో జూనియర్ అయిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏడవ స్థానంలో ఉండటం తాను కేవలం ముఖ్యమంత్రిగా ఉండటం పదే పదే తనే వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి రావడం సార్ అని సంబోధించడం వంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు కాస్త ఈగో ఫీలయ్యారు. దీంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢీ కొట్టాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీని పదేపదే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి.

అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తో రాజీ కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళకుండా ఉండటానికి ఆయన ఈగో కారణమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయి రాజీ కోసం ప్రయత్నాలు చేయడానికి చంద్రబాబు నాయుడు కి  ఈగో అడ్డం వస్తుంది అని కొంతమంది  చంద్రబాబు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం లేదని కేవలం తనతో సన్నిహితంగా ఉండే కొంతమంది రాజ్యసభ ఎంపీల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: