రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే పాలనా వ్యవహారాలు అన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆమోదం రాకపోతే అది అమలు అయ్యే అవకాశాలు ఉండవు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ముఖ్యమంత్రులు చెప్పినట్టుగా వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అని ఆరోపణలు కూడా మనం వింటూనే ఉంటాం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ఎక్కువగా సహకరిస్తుంటారు. సీఎం కేసీఆర్ కంటే కూడా ప్రభుత్వంలో ఆయనకే ఎక్కువగా పలుకుబడి ఉంది అనేది కొంతమంది మాట్లాడే మాట.

అధికారులతో కానీ మంత్రులతో కానీ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోయినా సరే సోమేష్ కుమార్ అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. సీఎం కేసీఆర్ కు పరిపాలన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటిని సోమేశ్ కుమార్ సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తూ ఉంటారని దీంతో సీఎం కేసీఆర్ కు సోమేష్ కుమార్ అత్యంత నమ్మకమైన అధికారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసిన సోమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం కేసీఆర్ తీసుకున్నారు.

ఇక అప్పటినుంచి సోమేష్ కుమార్ ప్రభుత్వంలోను అన్నీ తానే వ్యవహరించడమే కాకుండా పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు రాకుండా ఉండేందుకు న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండేందుకు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని తీసుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. అందుకే సీఎం కేసీఆర్ ఆయన పదవీ విరమణ చేసిన సరే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: