హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో.... ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. ఇక ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల విడుదల చేయకముందే అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేసేశాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య రోజుకో తగాదం ఏర్పడుతుంది. 

ఇక అటు ఎలాగైనా గెలవాలని నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో సీఎం కేసీఆర్ మరియు తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. తమ నేతలను టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తనను చంపడానికి కూడా ఓ తెలంగాణ మంత్రి ప్లానింగ్ చేస్తున్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. అయితే దీనికి గంగుల కమలాకర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా.. ఈటల రాజేందర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.  ఇల్లందకుంట మండల ఎంపీపీతో సహా ఎంపీటీసీ, ముగ్గురు సర్పంచ్ లు అధికార టీఆరెస్ పార్టీలో చేరారు.. ఇల్లందకుంట మండలంలోకి ఇవాళ ఈటెల రాజేందర్ పాదయాత్ర ఎంటర్ కానుంది. ఈ పాదయాత్ర ముంగిట ఎంపీపీ,   ఎంపిపి పావని,  ఎంపిటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య టీఆరెస్ లో చేరారు. ఇల్లందకుంట మండల ఇంచార్జ్ ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు నేతలు. దీంతో ఈటల రాజేందర్ కు ఊహించని షాక్ తగిలింది. కాగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ తో సహ ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక హుజూరాబాద్ బిజేపి అభ్యర్థి గా ఈటల రాజేందర్ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: