జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టాప్ ప‌వ‌న్ కల్యాణ్‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ఆయ‌న వాయిస్‌ను ఒక‌ప్పుడు.. భారీ ఎత్తున ఫ్రంట్ మీడియా ప్ర‌చారం చేసేది. ప‌వ‌న్ ఏం మాట్లాడినా.. పెద్ద ఎత్తున బ్యాన‌ర్ హెడ్డింగుల‌తో పంచ్ లైన్ల‌తో ఫోక‌స్ ఇచ్చిన ప్ర‌ధాన మీడి యా.. ఇప్పుడు ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టేసింది. దీనికి రీజనేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. జ‌గ‌న్ అధికారంలోకి రాక‌ముందు నుంచి.. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడుకూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌ధాన మీడియా ప్రాధాన్యం క‌ల్పించింది. ఆయ‌న జ‌గ‌న్‌ను తిట్టినా.. జిల్లాల్లో ప‌ర్య‌టించినా.. లేక పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. హైద‌రాబాద్‌కే ప‌ర‌మిత‌మై.. సోషల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేసినా కూడా ప్రాధాన్యం త‌గ్గ‌లేదు.

అలాంటిది.. గ‌డిచిన ఏడాదికాలంగా ప్ర‌ధాన మీడియా ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఆయ‌న కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను త‌గ్గించుకున్నారు. సినిమాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన మీడియాలో ఎక్క‌డా ఫోక‌స్ చేయ‌క‌పోగా.. ఐటంల ప్రాధాన్యాన్ని కూడా త‌గ్గించేసింది. ఒక‌ప్పుడు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు లేద‌నే.. వాద‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనూ వినిపిస్తోం ది.

తాము ఏం చేసినా.. ఏ చిన్న కార్య‌క్ర‌మం చేసినా.. గుర్తింపు ల‌భించేద‌ని..ఇ ప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. ఒక‌ప్పుడు టీవీ డిబేట్ల‌కు జ‌న‌సేన త‌ర‌ఫున ఒక‌రిద్ద‌రు పాల్గొనే వారు. వారిపై పార్టీ ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఎవ‌రూ డిబేట్ల‌లోనూ పాల్గొన‌డం లేదు. దీనికి ఆయా చానెళ్ల నుంచి పిలుపు రావ‌డం లేద‌ని అంటున్నారు. అంటే.. చంద్ర‌బాబుకు అనుకూలంగా.

టీడీపీ త‌ర‌ఫున/ మ‌ద్ద‌తుగా వాయిస్ వినిపించిన‌ప్ప‌డు ఈ వ‌ర్గం మీడియా పెద్ద ఎత్తున జ‌న‌సేన‌ను ప్ర‌మోట్ చేయ‌గా.. ఇప్పుడు జ‌న‌సేన చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం త‌గ్గించుకున్న త‌ర్వాత‌.. పూర్తిగా ప‌క్క‌న పెట్టింద‌ని..ఏదో అడ‌పా ద‌డ‌పా.. చిన్న‌పాటి ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతోంద‌ని అంటున్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌నసేన వ్యూహం మార్చుకోక‌పోతే.. ఇప్పుడున్న ఫోక‌స్ కూడా మ‌రింత త‌గ్గుతుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌న‌సేన ఈ విష‌యాన్ని గుర్తించినా.. ఏమీ చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: