ఏపీలో జ‌ర్న‌లిస్టుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్రెస్ అకాడ‌మీ సిద్ద‌మైంది.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. జ‌ర‌ల్నిస్టులంద‌రికి స‌మ‌గ్ర శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్రెస్ అకాడ‌మీ కృషి చేస్తోంద‌ని అకాడ‌మీ చైర్మ‌న్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో జ‌ర్న‌లిస్టుల‌కు శిక్ష‌ణ ఇచ్చామ‌ని...ప‌ద‌మూడు జిల్లాలు ప‌ర్య‌టించి జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు.గ్రామీణ జర్నలిస్టులకు అవగాహన కల్పించేలా‌ 12 పుస్తకాలు ప్రచురించామ‌ని...ఇప్ప‌టి వ‌ర‌కు ఆరువేల మంది జర్నలిస్టులు శిక్షణ తీసుకున్నారని తెలిపారు.యూజీసీ గైడ్ లైన్స్ పాటిస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ నుంచీ ఒక డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఇస్తున్నామ‌ని పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంద‌ని శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో మ‌భౌతికంగా క్లాసులు కుదరవు కనుక ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామ‌ని తెలిపారు.డిప్లొమా కోర్సులో జర్నలిజం - రచన నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్, సోషల్ మీడియా .. ఈ నాలుగు పేపర్లు ఉంటాయని జర్నలిజం మీద ఆసక్తి ఉన్న వారు కూడా ఈ కోర్సు చేయవ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు.

దీనికి వర్కింగ్ జర్నలిస్టులకు 1500 మాత్రమే ఫీజు డిగ్రీ చదివి, వర్కింగ్ జర్నలిస్టులు కాని యువతకు కూడా అవకాశం క‌ల్పిస్తున్నామ‌ని వారికి 3000 ఫీజు‌ను నిర్ణ‌యించామ‌న్నారు.ఈ అవ‌కాశాన్ని జ‌ర్నిలిస్టులంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.ప్రెస్ అకాడ‌మీ ద్వారా రాష్ట్రంలో ఎక్కువ‌మంది జ‌ర్న‌లిస్టుల‌ను త‌యారు చేయాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది.ప్ర‌ధాన మీడియాల‌న్నీ టీడీపీకి మ‌ద్దుతుగా ఉండ‌టంతో జ‌ర్న‌లిస్టులు కూడా ఎక్కువ‌గా టీడీపీకి మ‌ద్దుతుగా ఉన్నార‌నే భావ‌న‌లో అధికార పార్టీ ఉంది.కాబ‌ట్టి ప్రెస్ అకాడ‌మీ ద్వారా ఎక్కువ‌మంది జ‌ర్న‌లిస్టులకు శిక్ష‌ణ ఇచ్చి వైసీపీకి అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.జ‌ర్న‌లిస్టుల ద్వారా పార్టీ ప‌రిస్థితిని తెలుసుకునే విధంగా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నట్లు స‌మాచారం.వీరంతా పార్టీకి ఉప‌యోగ‌ప‌డతార‌ని పార్టీ ప్ర‌జ‌ల్లో ఎలా ఉంది..ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వీరిని వైసీపీ ఉప‌యోగించుకుంటుంద‌ని స‌మాచారం.గ‌తంలో కూడా ప్రెస్ అకాడ‌మీ ద్వారా అనేక మంది జ‌ర్నలిస్టుల‌కు శిక్ష‌ణ క‌ల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: