కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది అంటూ వివరణ కూడా ఇచ్చింది. అయితే కేంద్రం గత ఏడాది సెప్టెంబర్లో మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేసి చట్టాలుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు అంతా సవ్యంగానే గడిచింది. కానీ ఆ తర్వాత పంజాబ్ హర్యానా కు చెందిన రైతులు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు.



 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు ఎంతో నష్టం ఏర్పడుతుందని వెంటనే ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు  అంతేకాదు గత ఎనిమిది నెలల నుంచి ఇక దేశ రాజధాని నగరమైన ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ఇక ఇక్కడ ఉద్యమాన్ని ఆపేది లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు   ఈ క్రమంలోనే పలుమార్లు ఢిల్లీ నగరంలోకి  చొచ్చుకు వచ్చి నిరసనలు తెలిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు  దీంతో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రైతు సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.



 జూలై 22వ తేదీ నుంచి రైతు సంఘాలు అన్నీ కూడా జంతర్మంతర్లో కిసాన్ పార్లమెంటు నిర్వహిస్తామని అంటూ ఇటీవల ప్రకటించారు. సింగి సరిహద్దు వద్ద నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రైతు సంస్థలు ఈ ప్రకటన చేయడం ఆసక్తి కరం గా మారిపోయింది. ప్రతి రోజు కూడా రెండు వందల మంది ఉద్యమకారులు  జంతర్ మంతర్ కు వెళ్లి అక్కడ కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తారు అంటు స్పష్టం చేశారు  జూలై 22 నుంచి ఇక రుతుపవనాల పార్లమెంటు సమావేశాలు ముగిసేంత వరకు కూడా పార్లమెంటు నిర్వహిస్తామని స్పష్టం చేశారు  ఇలా జంతర్ మంతర్లో కిసాన్ పార్లమెంట్ నిర్వహించేందుకు ప్రతిరోజు ఒక స్పీకర్ ఒక డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నుకోబడతారు అని ఇక మొదటి రెండు రోజులు వ్యవసాయ చట్టాల పై చర్చ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రోజుకొ బిల్లుపై చర్చలు జరుగుతాయని స్పష్టం చేసారు రైతు నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: