ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు తగ్గుతోన్న ప‌రిస్థితి. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచంలో చాలా దేశాల్లో క‌రోనా మూడో వేవ్ ఉధృతి అయితే ప్రారంభ‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక మ‌న దేశంలో కూడా మ‌రో నెల లేదా నెల‌న్న ర రోజుల్లో క‌రోనా మూడో వేవ్ ముప్పు పొంచుకొస్తుంది అని నిపుణులు హెచ్చరిక‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజుకో కొత్త క‌రోనా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మొద‌టి సారి భార‌త్ లో డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అస్సాంకు చెందిన ఓ మహిళా డాక్ట‌ర్ కు ఒకేసారి ఆల్ఫా , డెల్టా వేరియంట్లు వ‌చ్చిన‌ట్టు క‌రోనా పరీక్షల్లో నిర్ధారణ అవ్వ‌డంతో వైద్య వ‌ర్గాలు సైతం షాక్ అయ్యాయి.

దీనిని దేశంలోనే తొలి అరుదైన కరోనా కేసుగా నిర్దారించ‌డంతో పాటు దీనిని తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా వైద్య నిపుణులు నిర్దారించారు. విచిత్రం ఏంటంటే ఆ మ‌హిళా డాక్ట‌ర్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నారు. అయినా ఆమెకు రెండు వేరియంట్లు వచ్చాయంటే ... వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌న్న విష‌యం చెప్ప‌క‌నే చెపుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా క‌రోనా రావ‌డం మాత్రం ఆగ‌డం లేదు.

ఆమెకు రెండు కరోనా వేరియంట్లు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని న‌మ్మ‌లేని డాక్ట‌ర్లు మ‌రోసారి ప‌రీక్ష‌లు చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లోనూ ఆమెకు రెండు వేరియంట్లు సోకిన విష‌యం నిర్దార‌ణ అయ్యింది. అయితే ఆమె ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని వైద్యులు చెపుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే యూర‌ప్ లోని బెల్జియంకు చెందిన 90 ఏళ్ల ఓ వృద్ధురాలిపై కూడా డబుల్ వేరియంట్లు దాడి చేశాయి.

అయితే ఆమె వ‌య‌స్సు 90 సంవ‌త్స‌రాలు కావ‌డంతో ఆమె ఆ ధాటికి త‌ట్టుకోలేక చ‌నిపోయింది. అయితే ఎన్ని వేరియంట్లు ఉన్నా మ‌నిషి శ‌రీరం దానిని ఎదుర్కొంటే వ‌చ్చే ఇబ్బంది లేద‌ని వైద్యులు చెపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: