ఇటీవల సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఎంతటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  మొదటి దశ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది భారత ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంత సులభంగానే మొదటి దశ కరోనా వైరస్ ను కంట్రోల్ చేసింది. హమ్మయ్య ఇక కరోనా వైరస్ ముప్పు తప్పింది అని దేశ ప్రజానీకం మొత్తం ఊపిరిపీల్చుకుంది. కానీ ఊహించని వేగంతో దూసుకొచ్చింది రెండవ దశ కరోనా వైరస్. మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ కరోనా వైరస్  దేశంలో ఎంతో విపత్కర పరిస్థితులను సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండవ దశ కరోనా వైరస్ ప్రభావాన్ని అర్థం చేసుకొని మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చే లోపే దేశంలో ఏకంగా ప్రతిరోజు నాలుగు లక్షల వరకు  వైరస్ కేసులు వెలుగులోకి రావడం మొదలైంది. దీంతో అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతికాల్సిన పరిస్థితి వచ్చింది . అయితే ఇక రెండో దశ కరోనా వైరస్ సమయంలో ఆక్సిజన్ కొరత ఎంతగానో బాధించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అక్సిజన్ కొరత కారణంగా ఎన్నో హృదయ విదారక ఘటన లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా ఆక్సిజన్ కొరత దేశంలో అల్లకల్లోల పరిస్థితుల ను సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 సరైన స్థాయిలో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఆక్సిజన్ కొరతపై ఇక కరోనా మరణంపై కూడా కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఒక్క మరణం కూడా సంభవించ లేదు అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీనిపై విపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయ్. ఇటీవల దీనిపై కాంగ్రెస్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మోడీ ప్రకటనతో నాకు మాటలు రావడం లేదు ఆక్సిజన్ కొరత  కారణంగా ఒక్క మరణం సంభవించలేదని మోడీ ప్రకటించిన తర్వాత ఆక్సిజన్ కొరత కారణంగా ఆప్తులను కోల్పోయిన వారు ఎంత బాధ పడి ఉంటారో అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ముమ్మాటికి అబద్ధమే ఇందుకుగాను మోడీ సర్కార్ పై కేసు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు సంజయ్ రౌత్.

మరింత సమాచారం తెలుసుకోండి: