హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి తెరాస పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది  చాలా ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఆ పార్టీలో చేరే అటువంటి కౌశిక్ రెడ్డి టికెట్ తనకే వస్తుందని అనుకుంటున్నాడు కానీ ప్రస్తుతం మరో పేరు వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలోని రాజకీయాలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి అని అనుకోవచ్చు.  కాంగ్రెస్ పై  తిరుగుబాటు చేసి ఆ పార్టీ నుంచి  బయటకు వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి  ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

సీఎం కేసీఆర్ హయాంలో గులాబీ కండువా కప్పుకున్నారు. హుజురాబాద్  నియోజకవర్గన్ని అభివృద్ధి చేయడానికి తాను తెరాసలో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే చాలు హుజురాబాద్ లో విజయం సాధించి తీరుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే తెరాస టికెట్ రేసులో  మరొక కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నికలో మాత్రం గెల్లు శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చే యోచనలో  టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీఎం కేసీఆర్  బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకని గెల్లు శ్రీనివాస్ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఆ పార్టీలో చేరిన తర్వాత  టిఆర్ఎస్ లో ఈ ప్రచారం జరగడం కౌశిక్ రెడ్డి అనుచరులకు ఆందోళన కలిగిస్తోంది.

తీరా పార్టీలో చేరిన తర్వాత టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.  ఏది ఏమైనా వారం పది రోజుల్లో  దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని తెరాస వర్గాలు తెలియజేస్తున్నాయి.  ఈరోజు కౌశిక్ రెడ్డి  కెసిఆర్ హయంలో  టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన  తనకు టిక్కెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. ఒకవేళ ఆయనకు టిక్కెట్ రాకపోతే ఇటు కాంగ్రెస్ కు, దూరమై, టిఆర్ఎస్ పార్టీలో తన భవిష్యత్తు ఏమవుతుందో అని  కౌశిక్ రెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: