అధికారం ఉన్న అదృష్టం లేని నాయకుల్లో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈయనకు రాజకీయాలు ఏ మాత్రం కలిసి రావడం లేదనే చెప్పొచ్చు. అయితే అలా కలిసి రాకపోవడానికే కారణం ఆయన సొంత తప్పిదమే. ఎందుకంటే నిలకడలేని రాజకీయాలు చేయడం వల్ల దాడి ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే ఎలాంటి పదవి లేకుండా పోయింది.

అసలు దాడి దశాబ్దాల పాటు ఏపీలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరుపున నాలుగుసార్లు అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఊహించని విధంగా దాడి, తన తనయుడుని తీసుకుని 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. టీడీపీని వీడేటప్పుడు దాడి, చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేశారో చెప్పాల్సిన పనిలేదు.

ఇక 2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ వైసీపీ తరుపున విశాఖపట్నం వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో, దాడి, జగన్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి, టీడీపీకి దగ్గరయ్యారు. పోనీ అక్కడైనా నిలకడగా ఉన్నారా?అంటే లేదనే చెప్పొచ్చు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు దాడి ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చింది. ఇలా నిలకడలేని రాజకీయాలు చేస్తున్న దాడి ఫ్యామిలీకి జగన్ టికెట్ ఇవ్వలేదు.

అధికారంలోకి వచ్చిన కూడా దాడి ఫ్యామిలీకి జగన్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఇటీవలే జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసింది. అందులో దాడి ఫ్యామిలీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అయితే వైసీపీ దాడి ఫ్యామిలీ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఫ్యూచర్‌లో దాడికి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఉంటే పార్టీలో ఉండే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. లేని పక్షంలో పరిస్తితులకు అనుగుణంగా దాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి చూడాలి వైసీపీలో దాడి ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో?    

మరింత సమాచారం తెలుసుకోండి: