ఐస్‌ క్రీమ్‌.. ఇదంటే చిన్నపిల్లలు పడి చచ్చిపోతారు.. చిన్నవాళ్లే కాదు.. పెద్దవాళ్లలోనూ చాలా మంది చాలా ఇష్టమైంది ఈ ఐస్‌ క్రీమ్.. యమలీల సినిమాలో యముడి పాత్రలో సత్యనారాయణ హిమక్రీములు అంటూ చేసిన అల్లరి చూస్తే.. ఈ ఐస్‌క్రీమ్ మాయాజాలం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. అయితే.. ఈ ఐస్‌ క్రీమ్‌ ధర ఎంత ఉంటుంది.. 10 రూపాయలు మొదలుకుని ఎంతైనా ఉండొచ్చు.. క్వాలిటీని బట్టి.. రకాలను బట్టి తయారు చేసిన విధాన్ని బట్టి.. అమ్మే స్థలాన్ని బట్టి రేట్లు మారుతుంటాయి.


అయితే ఎంత గొప్ప ఐస్‌ క్రీమ్ అయినా వందల రూపాయల్లోనే దొరుకుతుంది. మరీ అంత ప్రత్యేకమైనవి అయితే మహా అయితే ఓ వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. కానీ.. ఓ ఐస్‌ క్రీమ్ మాత్రం ఏకంగా రూ. 60 వేల రూపాయలు ధర ఉందట. వామ్మో.. 60 వేలా.. అంటే.. ఇంచు మించు 10 గ్రాముల బంగారం ధర కదా.. అవును.. ఈ ఐస్‌ క్రీమ్‌కు ధర కూడా అందుకోసమే ఎక్కువట. అంటే.. ఈ ఐస్‌ క్రీమ్ తయారీలో బంగారం కూడా వాడతారట. అదీ బడాయి.


బంగారంతో ఐస్‌క్రీమ్ ఏంటీ అని ఆశ్చర్యపోకండి.. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసా. దుబాయ్‌లోని జుమిరా రోడ్‌లోని ఓ కేఫేలో ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్‌ దొరుకుతుందట. దీని తయారీలో బంగారం సహా అనేక విలువైన ఆహార పదార్ధాలు వాడతారట. అందుకే దీనికి ఇంత రేటు. 23 కేరట్ల తినే బంగారం ఆకు పొర, వెనిల్లా గింజలు, కుంకుమ పువ్వు వంటివి ఖరీదైన పదార్థాలు ఈ ఐస్‌ క్రీమ్ తయారీ కోసం వాడతారట.


బాలీవుడ్‌ నటి  షెహనాజ్‌ ట్రెజరీ తాజాగా ఈ ఐస్‌క్రీమ్‌ రుచి చూశారట. ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పంచుకున్నారు. దీంతో ఈ రూ.60వేల ఐస్‌ క్రీమ్‌ వైరల్ అవుతోంది. విచిత్రం ఏంటంటే.. ఈ ఐస్‌క్రీమ్‌ను తనకు ఉచితంగానే ఇచ్చారని  నటి షెహనాజ్‌ చెబుతున్నారు. మరి ఈ ఐస్‌ క్రీమ్ రుచి చూడాలాంటే మీరు దుబాయ్ వెళ్లాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: