టిక్‌టాక్ అంటే తెలియ‌ని వారంటే ఉండ‌రూ.. ఇక మ‌న దేశాని గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా టిక్‌టాక్ వీడియోలు చేసేవాళ్లు.. దాని వ‌ల్ల అనేక చెడు ప‌రిణామాలున్నాయ‌ని భార‌త్‌లో బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌న దాయాది దేశం పాకిస్తాన్ ఆ యాప్‌పై నాలుగో సారి నిషేధం విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. అభ్యంతరకరమైన కంటెంట్‌ పదేపదే కనిస్తున్నాఅలాంటి కంటెంట్‌ను నియంత్రించడంతో పాటు తొల‌గించ‌డంలో టిక్‌టాక్ విఫలమైందని.. అందుకే నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ వివ‌రించింది.

   పాక్ గతంలో కూడా టిక్‌టాక్‌ను మూడుసార్లు తాత్కాలికంగా నిషేధం విధించింది. బ్యాన్ చేసిన ప్రతిసారీ.. ఇకపై ఆ త‌ప్పు జ‌రుగ‌ద‌ని అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌ను నియంత్రిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం చెప్పడంతో పాక్  నిషేధాన్ని ఎత్తేసింది. అయినా టిక్‌టాక్ లో అభ్యంతకర వీడియోలు  హల్‌చల్ చేస్తుండటంతో మరోసారి టిక్‌టాక్‌పై వేటు వేసింది.



అశ్లీల వీడియో కంటెంట్ల‌ను అందుబాటులో ఉంచిన కారణంగా 2020, అక్టోబర్‌లో టిక్‌టాక్‌ను తొలిసారి పాకిస్థాన్ బ్యాన్ చేసింది. అయితే.. అలాంటి కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకుంటామని టిక్‌టాక్ యాజ‌మాన్యం హామీ ఇచ్చింది. దాంతో పది రోజులకే ఆ నిషేధాన్ని తొలగించింది. ఆ త‌రువాత టిక్‌టాక్‌పై పెషావర్ కోర్టు మార్చిలో నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత నిషేధాన్ని ఏప్రిల్‌లో ఎత్తి వేసింది.


    పాకిస్థాన్‌లో టిక్‌టాక్ చాలా ఫేమ‌స్‌. భారత్‌లో నిషేధానికి గురైన ఈ యాప్‌కు పాకిస్తాన్‌లో 30 మిలియన్ల వ‌ర‌కు వినియోగ‌దారులు ఉన్నారు. దీన్ని బ‌ట్టే అక్కడ టిక్‌టాక్‌ను ఏ రేంజ్‌లో వినియోగిస్తున్నారో తెలుస్తోంది.  అయితే టిక్‌టాక్‌లో అశ్లీల వీడియోలు, అభ్యంతరకర వీడియోలు హల్‌చల్ చేయడం కొత్తేమీ కాదు.  టిక్‌టాక్ లో జ‌నవరి మార్చి మధ్యలో 6,495,991 వీడియోలను తొలగించిందటే ఏ రేంజ్‌లో టిక్‌టాక్‌లో అలాంటి కంటెంట్ వ‌స్తుందో చూడొచ్చు. కేవలం అశ్లీల వీడియోలు మాత్రమే కాదు హింసను ప్రేరేపించే వీడియోలు కూడా చాల‌నే టిక్‌టాక్‌లో చాలానే ఉన్నట్లు తేలింది.  అయితే.. భారత్‌లో ఇప్పటికే నిషేధాన్ని ఎదుర్కొంటున్న టిక్‌టాక్ ఇప్పుడు పేరు మార్చుకుని మళ్లీ మన దేశంలోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: