ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గంలో ఇద్దరు మంత్రుల‌ది ప్ర‌త్యేక శైలి. వారిద్ద‌రూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచిపేరు తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడిపైకానీ, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పైకానీ అస‌భ్య‌క‌ర‌మైన‌రీతిలో వ్యాఖ్య‌లు చేస్తుంటారు. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌ద‌ని వారి కుటుంబ స‌భ్యులు చెప్పినా కూడా ప‌ద‌వుల‌పై వ్యామోహంతోనో, జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచిపేరు కోస‌మో.. ఏద‌న్నాకానీ వారి వ్యాఖ్య‌ల్లో ప‌దును మాత్రం త‌గ్గ‌దు. దీనిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా వారు లెక్క‌చేయ‌డంలేదు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఒక మంత్రి మాత్రం త‌న దూకుడును త‌గ్గించారు. చంద్ర‌బాబు, లోకేష్‌పై విమ‌ర్శ‌ల‌ను ఒక‌ర‌కంగా ఆపేశారు. మ‌రోమంత్రి మాత్రం ఎక్క‌డా త‌గ్గేదేలే.. అంటున్నారు.

నాకు వంద‌కోట్ల అప్పులున్నాయంటూ చెబుతున్న మంత్రి?
తాజాగా ఏపీలో ఈ ఇద్ద‌రు మంత్రుల వ్య‌వ‌హార‌శైలిపై సామాజిక మాధ్య‌మాల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఒక మంత్రి త‌న‌ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌వారికి రూ.100 కోట్ల అప్పులున్నాయంటూ ప‌దే ప‌దే చెబుతున్నారు. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గాన్ని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని భావిస్తోన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర సానుభూతి కోసం ఆ మంత్రి ఇలా చెబుతున్నారంటూ సొంత పార్టీనేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఏ ప్ర‌జాప‌నులు చేసి వంద‌కోట్ల‌రూపాయ‌లు పోగొట్టుకున్నార‌ని, ఎందుకు అప్పుల‌య్యాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మంత్రివ‌ర్గంలో స్థానం నిలుపుకోవ‌డం కోసం చేసే ఎత్తులుగా వీటిని భావిస్తున్నారు.

మంత్రి అవినీతిపై గ‌తంలోనే క‌థ‌నాలు?
మంత్రి ప‌రిస్థితి ఇలా ఉండ‌గా, మ‌రో మంత్రి అవినీతికి పాల్ప‌డ్డారంటూ గ‌తంలోనే ప‌లు టీవీ ఛాన‌ళ్లు విస్త్ర‌తంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. ఆ మంత్రి పాల్ప‌డిన అవినీతిపై ఆధారాల‌తో స‌హా క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. అయిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు ఆయ‌న‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ రెండు సంవ‌త్స‌రాల్లో ఈ మంత్రి వంద‌కోట్ల రూపాయ‌లు సంపాదించి ఉంటారంటూ అధికార వైఎస్సార్ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ‌వ‌ర్గాల్లోను ఇదే అభిప్రాయం నెల‌కొంది. త‌న‌కు వంద‌కోట్ల రూపాయ‌ల అప్పులున్నాయ‌ని చెబుతున్న మంత్రి వాటిని ఎలా తీరుస్తారో? అనే సందేహాలు అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే అవినీతికి పాల్ప‌డిన మ‌రో మంత్రి ద‌గ్గ‌ర వంద‌కోట్ల రూపాయ‌ల నిల్వ‌లు ఉండొచ్చ‌ని, ఆయ‌న వాటిని ఎలా భ‌ద్ర‌ప‌రుస్తారోన‌నే సందేహం కూడా ప్ర‌జ‌ల‌ను వెంటాడుతోంది. మ‌రి ఈ ఇద్ద‌రు మంత్రులు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో స్థానం నిలుపుకుంటారా?  లేదా? అనేది త్వ‌ర‌లోనే తెలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag