గత కొంతకాలం నుంచి తాడేపల్లి నిర్వాసితురాలు శివశ్రీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం అనే కారణాన్ని చూపుతూ తాడేపల్లిలోని ఆయన నివాసానికి సమీపంలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేసే ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయకుండానే తమ ఇళ్లను కూల్చివేసేందుకు సిద్ధమైంది అంటూ ఇక స్థానికులు అందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనకారులకు న్యాయం చేయాలి అంటూ మద్దతుగా పాల్గొంటున్న తనకు ప్రాణహాని ఉంది అంటూ ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.



 తాడేపల్లిలోని అమరా రెడ్డి నగర్ కి చెందిన శివశ్రీ ఇక తనకు అధికార పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇక తమ కాలనీవాసులకు అండగా ఉండాలని న్యాయం జరిగేంత వరకూ మద్దతు ఇవ్వాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసి కోరింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు నుంచి తనకు మరింత బెదిరింపులు ఎక్కువ అయ్యాయి అంట శివశ్రీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏకంగా పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిచి మరీ బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించింది.  ఇటీవలే మరోసారి మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ను కలవడం నా తప్ప అంటూ వ్యాఖ్యానించింది..


 తాడేపల్లి లో ఇళ్ల కూల్చివేత పేరుతో తన ఇంటిని కూడా కూల్చివేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  జగన్ ప్రభుత్వం ఎంతో కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శివశ్రీ. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసినప్పటినుంచి వైసీపీ నేతలు పోలీసులు అందరూ కూడా తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి పిలిచి బెదిరింపులకు సైతం పాల్పడ్డారంటూ ఆరోపించింది. వైసిపి పాలనలో అవినీతి పెరిగిపోయిందని అవి చూడలేక నే ఇక వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అంటూ శివశ్రీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: